అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Turmeric farmers | నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును (agricultural market yard) అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రతినిధులు పరిశీలించారు. రైతులు పసుపు (turmeric) తీసుకురాగానే కాంటా వేయాలని డిమాండ్ చేశారు.
మార్కెట్‌కు పసుపు పంట రావడం ప్రారంభం అయింది. జనవరి 9న యార్డులో పసుపు క్వింటాల్‌కు రూ.16,800 ధర పలికింది. ఈ విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో మరుసటి రోజు నుంచి రైతులు (farmers) భారీగా పసుపు తీసుకొచ్చారు. పంట ఎక్కువగా రావడంతో వ్యాపారులు ధర తగ్గించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రతినిధులు మంగళవారం మార్కెట్‌ను పరిశీలించారు.
Turmeric farmers | కాంటాలు వేయక నష్టం
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్, కార్యదర్శి బి. దేవారాం మాట్లాడుతూ.. ఈ నెల 2న గంజికి సుమారుగా తొమ్మిది వేల క్వింటాళ్లు పసుపు వచ్చిందన్నారు. వెంటనే కాంటా వేయకపోవడంతో రైతులు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారని పేర్కొన్నారు. పసుపును బీట్ కాగానే వెంటనే బస్తాలు నింపి కాంటాలు వేయాలని కోరారు. జనవరి 9న రూ.16,777 పలికిన ధర నేడు రూ.9 వేలకు పడిపోయిందన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. పసుపు రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్. జిల్లా ప్రధాన కార్యదర్శి భాజన్న, బాబన్న, బి కిషన్, పోషన్న, చౌటుపల్లి లింగారెడ్డి పాల్గొన్నారు.