ePaper
More
    HomeతెలంగాణTurmeric Board | పసుపు రైతులకు పండుగే..

    Turmeric Board | పసుపు రైతులకు పండుగే..

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Turmeric Board | పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరడమే కాకుండా ఇందూరు కేంద్రంగా పసుపు బోర్డు (Turmeric Board) ఏర్పాటు కావడం శుభపరిణామం. ప్రత్యేకించి నిజామాబాద్​లోనే జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని (National Turmeric Board office) ఏర్పాటు చేయగా.. దానిని నేడు ప్రారంభించనుండడం. ఈ ప్రాంత రైతుల పాలిట వరంగా చెప్పవచ్చు. త్వరలోనే బోర్డు పూర్తిస్థాయి కార్యకాలాపాలు మొదలు కానున్నాయి. దీంతో త్వరలో పసుపు. రైతులకు (Farmers) మంచి రోజులు రానున్నాయి. కాగా.. ఇందుకు ఎంపీ అర్వింద్​ (MP Arvind) చేసిన కృషి మరువలేనిది.

    జిల్లాలో వేల మంది రైతులు పసుపు సాగు చేస్తారు. అయితే పసుపు రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. పసుపు బోర్డు (Turmeric Board) ఏర్పాటు చేస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన రైతులు ఏళ్లుగా పోరాటం చేశారు. ఇందులో భాగంగా 2019 పార్లమెంట్​ ఎన్నికల సమయంలో నిజామాబాద్​ ఎంపీ స్థానానికి పలువురు పసుపు రైతులు (Turmeric Farmers) పోటీ చేశారు. పసుపు బోర్డు అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలనే ఉద్దేశంతో 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. కాగా.. ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్​లో 12 ఈవీఎంలు వాడాల్సి వచ్చింది. జిల్లాకు చెందిన 30 మంది పసుపు రైతులు ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసిలోనూ నామినే షన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో చర్చనీయాంశమైంది.

    READ ALSO  PM Modi | భారత ఆయుధాల వైపు.. ప్రపంచ దేశాల చూపు : ప్రధాని మోదీ

    Turmeric Board | బాండ్​ రాసిచ్చి.. రైతుల కల నెరవేర్చిన అర్వింద్​

    నిజామాబాద్ ఎంపీగా 2019లో బీజేపీ (BJP) నుంచి పోటీ చేసిన ధర్మపురి అర్వింద్​ తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొ స్తానంటూ బాండ్ పేపర్ పై (Bond Paper) రాసి చ్చారు. అయితే మొదట్లో బోర్డు ఏర్పాటులో జాప్యం జరిగింది. అయినప్పటికీ అర్వింద్​ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బోర్డు ఏర్పాటు కోసం ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర మంత్రులను పలు పర్యాయాలు కలిశారు. ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ క్రమంలోనే నిజామా బాద్​ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Central Governament) ప్రకటించింది.

    Turmeric Board | 2023లో ప్రధాని మోదీ ప్రకటన

    తెలంగాణలో పసుపు బోర్డు ప్రధానాంశంగా మారడంతో 2023 అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ‘పాలమూరు గర్జన’లో స్వయంగా బోర్డును ప్రకటించారు. ఆ తర్వాత కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు. నిజామాబాద్​లోనే కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు 2025 జనవరిలో ప్రకటించింది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా జనవరి 14న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Minster piyush goyal) ఎంపీ అర్వింద్​తో (MP Arvind) కలిసి ఢిల్లీ నుంచి వర్చువల్​గా పసుపు బోర్డు సేవలను అందుబాటులోకి తెచ్చింది.

    READ ALSO  Fake Liquor | కల్తీ మద్యానికి బ్రాండెడ్​ స్టిక్కర్లు.. బెల్ట్​ షాపులే లక్ష్యంగా విక్రయాలు

    Turmeric Board | ఛైర్మన్​గా ‘ఇందూరు బిడ్డ’ పల్లె గంగారెడ్డి

    జిల్లాలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని (National Turmeric Board office) ఏర్పాటు చేయడమే కాకుండా బోర్డు మొదటి ఛైర్మన్​గా జిల్లా వ్యక్తినే నియమించారు. ఆర్మూర్ మండలం (Armoor Mandal) అంకాపూర్​కు చెందిన పల్లె గంగారెడ్డిని ఛైర్మన్​ బాధ్యతలు అప్పగించారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన 1991 – 93 వరకు అంకాపూర్ (Ankapur) గ్రామ కమిటీ అధ్యక్షుడిగా 1993 – 97 వరకు బీజేపీ ఆర్మూర్ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, భాజపా జిల్లా కార్యదర్శిగా రెండు పర్యాయాలు జిల్లా అధ్యక్షు డిగా పనిచేశారు.

    Turmeric Board | తెలంగాణలోనే అత్యధికం

    ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు భారత్​లో సాగవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే పంటలో ఇది 75 శాతం. ఇక దేశంలో అత్యధికంగా తెలంగాణ (Telangana), మహారాష్ట్రలోనే (Maharastra) పసుపు పండుతుంది. రాష్ట్రంలో మన జిల్లాలోనే పసుపు ఎక్కువగా సాగు చేస్తారు. గతేడాది జిల్లా రైతులు 19 వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సాగు చేయగా.. ఇందులో జిల్లా రైతులు 22 వేల ఎకరాల పసుపు పండించారు.

    READ ALSO  Kamareddy SP | వాగుల వద్ద సెల్ఫీల కోసం సాహసాలు చేయవద్దు..

    Turmeric Board | ఎంపీ అర్వింద్​ కృషి

    2024 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాక ఇందూరులో జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) ఏర్పాటు విషయంలో మహారాష్ట్ర సర్కారు అడ్డు తగిలింది. ఎక్కువ విస్తీర్ణంలో పసుపు పంట సాగయ్యే తమ రాష్ట్రంలోనే బోర్డు ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం, అక్కడి బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఎంపీ ధర్మపురి అర్వింద్​ తీవ్రంగా కృషి చేసి ఇందూరుకు పసుపు బోర్డు తీసుకు వచ్చారు. పసుపు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్​లోనే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగారు. జిల్లాలో పసుపు పండే తీరును, రైతుల కష్టాలను వివరిస్తూ చివరికి బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు.

    Latest articles

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    Bandi Sanjay | బండి సంజయ్​పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Bandi Sanjay | భాజపా సీనియర్​ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay...

    More like this

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...