ePaper
More
    HomeతెలంగాణMP Arvind | ‘ఇందూరు పసుపు బ్రాండ్’ పేరుతో ఈజిప్ట్​ దేశానికి పసుపు ఎగుమతి

    MP Arvind | ‘ఇందూరు పసుపు బ్రాండ్’ పేరుతో ఈజిప్ట్​ దేశానికి పసుపు ఎగుమతి

    Published on

    అక్షరటుడే జక్రాన్ పల్లి: MP Arvind | ‘ఇందూరు పసుపు బ్రాండ్’ పేరుతో ఈజిప్ట్ (Egypt)​కు పసుపును ఎగుమతి చేయనున్నామని ఎంపీ అర్వింద్ (MP Arvind)​ పేర్కొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రైతులు స్వయంగా ఏర్పాటు చేసుకున్న పసుపు పరిశ్రమను సోమవారం (Nizamabad) ఆయన ప్రారంభించారు.

    జక్రాన్​పల్లి(Jakranpalli) మండలంలోని మనోహరాబాద్(Manoharabad)​లో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పండించిన పసుపు పంటను (Turmeric crop) మార్కెట్​కు వెళ్లి విక్రయించేందుకు రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రైతులే స్వయంగా పసుపు ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

    జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్​ పల్లె గంగారెడ్డితో మాట్లాడుతున్న ఎంపీ ధర్మపురి అర్వింద్​

    పరిశ్రమ ఏర్పాటు వెనుక రైతుల కృషి దాగి ఉందన్నారు. ఈ పరిశ్రమలో పసుపుతో ఆయిల్​ సైతం తీయనున్నారని ఆయన వివరించారు. ఇందూరు పసుపు బ్రాండ్ పేరుతో విదేశాలకు పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని ఆయన తెలిపారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి (National Turmeric Board Chairman Palle Gangareddy), ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ mla dhanpal suryanarayana, రాకేష్ రెడ్డి mla Rakesh reddy, జాతీయ పసుపు బోర్డు సెక్రెటరీ భవానిశ్రీ IAS Bhavani shri, బొమ్మ జయశ్రీ, స్థల దాత హిమగిరిరావు, ఉత్పత్తిదారుల సంఘం ఛైర్మన్ తిరుపతి రెడ్డి, డైరెక్టర్లు, రైతులు తదితరులు ఉన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...