ePaper
More
    HomeతెలంగాణTurmeric Board | స్థానిక ఎన్నికల కోసమే మళ్లీ పసుపు బోర్డు ప్రారంభం: ఎమ్మెల్యే వేముల

    Turmeric Board | స్థానిక ఎన్నికల కోసమే మళ్లీ పసుపు బోర్డు ప్రారంభం: ఎమ్మెల్యే వేముల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Turmeric Board | స్థానిక ఎన్నికల కోసమే పసుపు బోర్డు కార్యాలయాన్ని మళ్లీ ప్రారంభించారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి (MLA Vemula Prashanth Reddy) విమర్శించారు.

    ఇప్పటికే ఒక చోట ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మరో తాత్కాలిక భవనంలోకి మార్చారన్నారు. దానిని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Union Home Minister Amit Shah) చేతుల మీదుగా ప్రారంభింపజేశారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు ఉండటంతోనే బోర్డు కార్యాలయం ప్రారంభం పేరిట హంగామా చేశారని విమర్శించారు. రెండుసార్లు ఓకే బోర్డును ప్రారంభిచడంతో పసుపు రైతులు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

    Turmeric Board | మద్దతు ధర కావాలి

    పసుపు రైతులకు (turmeric farmers) ఆఫీసులు, బోర్డులు అవసరం లేదని మద్దతు ధర కావాలని ప్రశాంత్​రెడ్డి అన్నారు. బోర్డుల ప్రారంభోత్సవం పేరిట బీజేపీ రైతులను ఏమార్చాలని చూస్తోందన్నారు. పసుపు రైతుల గురించి సభలో అమిత్​ షా (Amit Shah) ఒక్క అంశం కూడా మాట్లాడలేదన్నారు. పసుపు బోర్డు కోసం రైతులు ఏళ్లుగా పోరాటం చేశారన్నారు. 2014 నుంచి 2018 వరకు నిజామాబాద్​ ఎంపీగా కవిత ఉన్న సమయంలో కూడా తాము పసుపు బోర్డు (Turmeric Board) కోసం ప్రయత్నాలు చేశామని ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు.

    Turmeric Board | పైసలు లేకుండా బోర్డు ఏం చేస్తుంది

    నిజామాబాద్​లోని సుగంద ద్రవ్యాల బోర్డు భవనంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని 2025 జనవరిలోనే ప్రారంభించారన్నారు. అప్పుడే బోర్డు జాతీయ ఛైర్మన్​గా పల్లె గంగారెడ్డి (Palle Ganga Reddy) బాధ్యతలు స్వీకరించారన్నారు. 2025 బడ్జెట్​లో కేంద్ర ప్రభుత్వం (central government) పసుపు బోర్డుకు నిధులు కేటాయించలేదన్నారు. పైసలు లేకుండా బోర్డు ఏం పనులు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. పసుపు ఏర్పాటు అయినా కూడా గత సీజన్​ పసుపు రైతులు మద్దతు ధర దక్కక నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా బోర్డు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.

    Turmeric Board | మూడో వ్యక్తి లేరు..

    పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఆరు నెలలు అవుతోందని ప్రశాంత్​ రెడ్డి (Prashanth Reddy) అన్నారు. అయినా ఇప్పటివరకు సిబ్బందిని కేటాయించలేదని విమర్శించారు. బోర్డు ఛైర్మన్​, సెక్రెటరీ తప్పా మూడో వ్యక్తి లేరన్నారు. పని చేసే సిబ్బంది లేరని, పాలకవర్గం కూడా లేదన్నారు. నిధులు లేవని, సిబ్బంది లేరని.. బోర్డు ఎలా పనిచేస్తుందని ఆయన ప్రశ్నించారు.

    పసుపు బోర్డుకు (Turmeric Board) సిబ్బందిని కేటాయించాలని, పాలకవర్గాన్ని నియమించాలని ఆయన డిమాండ్​ చేశారు. శాశ్వత భవనం నిర్మించాలని, పసుపు రైతులకు క్వింటాల్​కు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలన్నారు. బయట మార్కెట్​లో పసుపు పంటకు ధర లేకపోతే మద్దతు ధరకు బోర్డు కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...