అక్షరటుడే, కామారెడ్డి: Tummala Kamareddy Visit | రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageshwar Rao) కామారెడ్డి జిల్లాకు రానున్నారు. పాల్వంచ మండల కేంద్రంలో నిర్వహించనున్న మెగా ఆయిల్ ఫార్మ్ ప్లాంటేషన్ (Oil Palm Plantation) కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు.
Tummala Kamareddy Visit | హైదరాబాద్ నుంచి..
హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు నుంచి బయలుదేరి 11 గంటలకు నేరుగా పాల్వంచ మర్రికి మంత్రి(Telangana Minister) చేరుకోనున్నారు. అనంతరం ఆయిల్ ఫార్మ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం 11:30కు ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో రైతులతో (Farmers Meeting) సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30కు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. ఈ మేరకు మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.