అక్షరటుడే, ఇందూరు: TUCI | ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (Trade Union Centre of India) రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కోటగల్లీలోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 21, 22 తేదీల్లో నిజామాబాద్లో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మహాసభల ఆహ్వాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొఫెసర్ లింబాద్రి, ప్రధాన కార్యదర్శిగా సూర్యం, కోశాధికారిగా నరేందర్, అలాగే ఆఫీస్ బేరర్లు, గౌరవ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. కార్మిక హక్కుల రక్షణ కోసం బలమైన ఉద్యమాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్, పద్మ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముత్తెన్న, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.