అక్షరటుడే, వెబ్‌డెస్క్: Team India | నెల రోజుల క్రికెట్ మేళా ముగింపునకు చేరుకుంది. భారత్, శ్రీలంక Srilanka సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ICC Women’s ODI World Cup 2025 తుది అంకానికి సన్నాహాలు పూర్తయ్యాయి.
ఆదివారం జరిగే ఫైనల్‌లో భారత మహిళా జట్టు – దక్షిణాఫ్రికా జట్టు South African team తమ తొలి ప్రపంచకప్ కిరీటం కోసం తలపడనున్నాయి. ఆసీస్ Australia, ఇంగ్లండ్ England వంటి అగ్ర జట్లు సెమీస్‌లోనే ఔట్ కావడంతో, ఈసారి ట్రోఫీ కొత్త చిరునామాకు చేరనుంది.
పురుషుల క్రికెట్‌లో మహత్తర విజయాలు సాధించిన భారత్ ఇప్పుడు మహిళల క్రికెట్‌లోనూ అదే చరిత్రను సృష్టించేందుకు సిద్ధమైంది. 1983లో కపిల్‌దేవ్ సేన గెలిచిన ట్రోఫీ భారత క్రికెట్‌ను ఎలా మార్చిందో, ఈసారి హర్మన్‌ప్రీత్ సేన విజయం సాధిస్తే మహిళా క్రికెట్ భవిష్యత్తు మారిపోవడం ఖాయం.
Team India | విజయం కోసం..
హర్మన్‌ప్రీత్ Harmanpreet, స్మృతి Smriti, దీప్తి శర్మతో Deepti Sharma పాటు జెమీమా రోడ్రిగ్స్ Jemimah Rodrigues, రిచా ఘోష్, Richa Ghoshషెఫాలీ వర్మ Shefali Verma వంటి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు జట్టుకు బలం చేకూరుస్తున్నారు.
సెమీస్‌లో Semi Final ఆస్ట్రేలియాపై రికార్డు స్థాయిలో లక్ష్య ఛేదన (338 రన్స్) సాధించిన భారత జట్టు ప్రస్తుతం ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే బౌలింగ్ యూనిట్ మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 13వ ఎడిషన్‌గా జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది మూడో ఫైనల్ (2005, 2017), దక్షిణాఫ్రికాకు మొదటిసారి. ఈసారి ఎవరు గెలిచినా మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమవడం ఖాయం.
మరోవైపు నేడు పురుషుల టీం ఆసీస్‌తో మ్యాచ్ ఆడనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న పోరులో టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. హోబర్ట్ వేదికగా ఆదివారం జరిగే మూడో టీ20లో ఆతిథ్య ఆసీస్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో టీ20లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను India చిత్తుగా ఓడించింది. పవర్ ప్లేలోనే వరుసగా నాలుగు వికెట్లు కోల్పోవడంతో కోలుకోలేకపోయింది. దీంతో ఆసీస్‌కు తక్కువ టార్గెట్‌ని విధించింది. అయితే వరుసగా టాస్ ఓడుతున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో టాస్‌తో పాటు మ్యాచ్ కూడా గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
