అక్షరటుడే, వెబ్డెస్క్: TTD Offline Tickets | తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల (Srivani offline tickets) జారీ రద్దు చేసింది. తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29వ తేదీలకు (శని, ఆది, సోమవారం) సంబంధించి శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లో, తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో (Renigunta airport) శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేయరు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన ప్రణాళికలను రూపొందించికోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
TTD Offline Tickets | తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల కొండ భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లలోని భక్తులకు తాగునీరు, పాలు, టీ, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. క్యూలైన్ల పరిస్థితిని టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.