అక్షరటుడే, తిరుమల: TTD : నిబంధనలు ఉల్లంఘిస్తున్న సిబ్బందిపై టీటీడీ కొరఢా ఝలిపిస్తోంది. తాజాగా ముగ్గురు ఉద్యోగులపై చర్యలు చేపట్టింది. ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను సస్పెండ్ చేసింది. మరొకరికి ఛార్జ్ మెమో ఇష్యూ చేసింది.
జూనియర్ అసిస్టెంట్ రాము (junior assistant Ramu) ప్రైవేటు వ్యక్తులతో కలిసి వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ గుర్తించింది. ఇక ఆఫీస్ సబార్డినేట్ ఎన్ శంకర్ (office subordinate N Shankar) తన వసతి గృహాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడంతో పాటు ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నట్లు విచారణలో తేలింది.
దీంతో జేఏ రాము, ఆఫీస్ సబార్డినేట్ శంకర్‌ను టీటీడీ సస్పెండ్ చేసింది. ఇక మరో జూనియర్ అసిస్టెంట్ చీర్ల కిరణ్ (junior assistant Cheerla Kiran) కార్యాలయ వేళల్లో విధులు నిర్వర్తించకుండా.. రాజకీయ ప్రముఖుల సేవలో తరిస్తున్నట్లు టీటీడీ గుర్తించింది. ఈ మేరకు అతడికి ఛార్జ్ మెమో ఇచ్చింది.
TTD : కొనసాగుతున్న భక్తుల రద్దీ…
మరో వైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 72,951 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. రూ. 3.71 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.