ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    Published on

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను ఏర్పాటు చేసింది. మంగళవారం దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (Tirumala Tirupati Devasthanams Board) ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు Chairman B.R. Naidu, ఈవో శ్యామలరావు EO Shyamala Rao ప్రారంభించారు.

    Tirumala : ప్రయోజనం ఏమిటంటే..

    స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేది. ఇకపై ఆ సమస్య ఉండదు. తిరుమలలోనే అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించగలిగే విధంగా పరిశోధనశాలను తీర్చిదిద్దారు.

    Tirumala : కల్తీ నెయ్యి వ్యవహారంతో..

    తిరుమలలో నెయ్యి నాణ్యతను పరీక్షించే వసతి లేదని ఇప్పటివరకు లేదు. కాగా, గతంలో కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూడటంతో.. తాజాగా స్థానికంగానే నెయ్యి నాణ్యతను పరీక్షించే ఏర్పాట్లను చేశారు.

    నెయ్యిలో నాణ్యత శాతం, కల్తీ శాతాన్ని వెంటనే విశ్లేషించే HPLC (High Performance Liquid Chromatograph), GC (Gas Chromatograph) యంత్రాలు ఏర్పాటు చేశారు. ఈ యంత్రం విలువ రూ.75 లక్షల వరకు ఉంటుంది. దీనిని గుజరాత్​ (Gujarat) కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (National Dairy Development Board – NDDB) విరాళంగా అందజేసింది.

    Tirumala : మైసూర్​లో ప్రత్యేక శిక్షణ..

    ఆహార నాణ్యత పరిశీలనలో పాలుపంచుకునే సిబ్బంది, పోటు కార్మికులకు మైసూర్‌ (Mysore) లోని CFTRIలో ప్రత్యేక శిక్షణ అందించారు. ఆహార నాణ్యత పరిశోధనశాల ప్రారంభ వేడుకలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, సదాశివరావు, నరేష్, సీఈ సత్య నారాయణ, డిప్యూటీ ఈవోలు సోమన్నారాయణ, భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...