HomeUncategorizedTTD Chairman | సాక్షి టీవీ, పత్రికపై టీటీడీ ఛైర్మన్​ పరువు నష్టం దావా

TTD Chairman | సాక్షి టీవీ, పత్రికపై టీటీడీ ఛైర్మన్​ పరువు నష్టం దావా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD Chairman | టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు (TTD Chairman BR Naidu) సాక్షి టీవీ, సాక్షి పత్రికపై పరువు నష్టం దావా వేశారు. సాక్షి మీడియాలో ఈ నెల 10, 14 తేదీల్లో తనపై నిరాధార వార్తలు ప్రచురించారని ఆయన ఆరోపించారు. ఆయా వార్తలతో తన ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు.

అంతేగాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి (Sakshi) మీడియా తనకు క్షమాపణా చెప్పాలని డిమాండ్​ చేశారు. టీటీడీకి రూ.10 కోట్లు చెల్లించాలన్నారు. రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయాలంటూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు టీటీడీ ఛైర్మన్​ ఫిర్యాదు చేశారు.