అక్షరటుడే, వెబ్‌డెస్క్: Earthquake | అమెరికాలోని అలస్కా తీర ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 12.37 గంటల సమయంలో భారీ భూకంపం(Major Earthquake) సంభవించడంతో అంతా ఉలిక్కి పడ్డారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.3గా నమోదైంది. ఈ భూకంపం తరువాత, సునామీ హెచ్చరిక జారీ చేసినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.. కేంద్రం సాండ్ పాయింట్ అనే ద్వీప పట్టణానికి 54 మైళ్లు (87 కిలోమీటర్లు) దక్షిణంగా గుర్తించబడింది. భూకంపం 20.1 కిలోమీటర్ల లోతులో సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. భూకంపం తర్వాత అలస్కా ద్వీపకల్పం(Alaska Peninsula) మరియు దక్షిణ అలస్కా తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు.
Earthquake | సునామీ హెచ్చరిక..
పామర్‌లోని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం (National Tsunami Warning Center) ప్రకారం, సముద్రంలో సునామీ తరంగాలు ఏర్పడినట్లు నిర్ధారణ అయింది. భూకంపం తర్వాత అధికారులు దక్షిణ అలస్కా, అలస్కా ద్వీపకల్పానికి సునామీ(Tsunami) హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అలస్కా ద్వీపకల్పంతో పాటు దక్షిణ అలస్కా, అలస్కాలోని కెన్నెడీ ఎంట్రన్స్ (హోమర్‌కు 40 మైళ్లు దక్షిణాన) నుంచి అలస్కాలోని యునిమాక్ పాస్ (ఉనలస్కాకు 80 మైళ్లు NE) వరకు పసిఫిక్ తీరాలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు. అయితే దూర ప్రాంతాలకు మాత్రం సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం స్పష్టం చేసింది.
ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తుంది. అత్యవసర సేవల విభాగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోస్ట్ గార్డ్(Coast Guard), వాతావరణ అధికారులు(Weather Officers), అత్యవసర బృందాలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అలస్కా.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగం కావడంతో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.1964లో, అలస్కాలో 9.2 తీవ్రతతో భూకంపం సంభవించి 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం.2023 జూలైలో, అలస్కా ద్వీపకల్పంలో 7.2 తీవ్రతతో మరో భూకంపం సంభవించినా, పెద్దగా నష్టం జరగలేదు. అయితే తీర ప్రాంతాల్లో నివసించే వారు అధికారుల సూచనలు పాటించాలి. అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి.