HomeUncategorizedIsrael - Iran war | భ‌గ్గుమన్న ప‌శ్చిమాసియా.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చ‌రిక‌లు.. కొట్టిప‌డేసిన ఖ‌మేనీ

Israel – Iran war | భ‌గ్గుమన్న ప‌శ్చిమాసియా.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చ‌రిక‌లు.. కొట్టిప‌డేసిన ఖ‌మేనీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel – Iran war : ఇజ్రాయిల్‌, ఇరాన్ యుద్ధంతో ప‌శ్చిమాసియా భ‌గ్గుమంటోంది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌(US President Donald Trump).. ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయ‌తొల్లా అలీ ఖ‌మేనీ(Iranian Supreme Leader Ayatollah Ali Khamenei)కి హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం, అదే స‌మ‌యంలో యుద్ధం మొద‌లైంద‌ని ఖ‌మేనీ స్పందించడం ప‌రిస్థితిని మ‌రింత తీవ్ర‌త‌రం చేసింది.

ఈ నేప‌థ్యంలో అమెరికా నేరుగా యుద్ధ రంగంలోకి దిగ‌నుంద‌న్న వార్త‌లు ప్ర‌పంచాన్ని క‌ల‌వర‌పెడుతున్నాయి. ఇది మూడో ప్ర‌పంచ యుద్ధానికి దారి తీస్తుంద‌న్న ఆందోళ‌న‌లు రేకెత్తిస్తున్నాయి. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఖమేనీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఉగ్రవాద జియోనిస్ట్ పాలనకు గట్టి సమాధానం చెప్తామని, వారి పట్ల కనికరం చూపే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. యుద్ధం మొద‌లైంద‌ని ఖ‌మేనీ స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో అమెరికా ఎలా స్పందిస్తుంద‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.

Israel – Iran war : బేష‌రతుగా లొంగిపోవాల్సిందే..

ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ బేష‌ర‌తుగా లొంగిపోవాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రించారు. జీ-7 G-7 సమావేశం నుంచి అర్ధంతరంగా వెనుదిరిగి వ‌చ్చిన ట్రంప్ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై దాదాపు 80 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తమకు తెలుసన్నారు. ప్ర‌స్తుతానికి ఖమేనీని చంపే ఉద్దేశం త‌మ‌కు లేదని.. ఆయ‌న బేష‌ర‌తుగా తక్షణమే లొంగిపోవాలని సూచించారు. లేక‌పోతే ప‌రిస్థితులు తీవ్రంగా మారుతాయ‌ని తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్‌’ లో హెచ్చరించారు.

ఈ పోస్టు చేసిన కొద్దిసేప‌టికే ఖమేనీ ఎక్స్ వేదికగా స్పందించారు. న‌మి పేరుతో యుద్ధం మొద‌లైంది. అలీ త‌న జుల్ఫిక‌ర్ (క‌త్తి)Zulfiqar (sword)తో క‌లిసి ఖైబ‌ర్‌కు వ‌చ్చేశార‌ని పేర్కొన్నారు. ఉగ్రవాద జియోనిస్ట్ పాలనకు గట్టిగా బదులిస్తామని.. కనికరం చూపబోమని ఒక పోస్టులో వార్నింగ్ ఇచ్చారు. బుధవారం తెల్లవారుజామున ఇరాన్ ఇజ్రాయెల్‌పై రెండు రౌండ్ల బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కొద్దిసేపటికే ఈ పోస్ట్ పెట్టడం గమనార్హం.

ఏడో ద‌శాబ్దంలో యూదుల పట్ట‌ణ‌మైన ఖైబ‌ర్‌పై షియా ఇస్లాం మొద‌టి ఇమామ్ యుద్ధం చేసి విజ‌యం సాధించింది. నాటి ఘ‌ట‌న‌ను గుర్తుచేస్తూ ఖ‌మేనీ ఈ పోస్టు చేసిన‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. మరో పోస్టులో ఫార్సీ భాషలో “యుద్ధం ప్రారంభమవుతుంది” అని ఖమేనీ పోస్ట్ చేశాడు. దీంతో పాటు ఖైబర్ చారిత్రాత్మక యుద్ధాన్ని సూచిస్తూ కోట ద్వారంలోకి కత్తితో ప్రవేశించే వ్యక్తి చిత్రం కూడా ఉంది.