ePaper
More
    Homeబిజినెస్​Global Market Analysis | ట్రంప్‌ సుంకాల బెదిరింపులు.. మళ్లీ నష్టాల బాటలో గ్లోబల్‌ మార్కెట్లు

    Global Market Analysis | ట్రంప్‌ సుంకాల బెదిరింపులు.. మళ్లీ నష్టాల బాటలో గ్లోబల్‌ మార్కెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global Market Analysis : యూఎస్‌ ప్రెసిడెంట్‌(US president) ట్రంప్‌ చైనాపై మరోసారి సుంకాలతో బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో వాల్‌స్ట్రీట్‌(Wall street) నష్టాలతో ముగిసింది. దీని ప్రభావం ఆసియా మార్కెట్లపైనా కనిపిస్తోంది. ప్రధాన ఆసియా మార్కెట్లలోనూ ఒత్తిడి నెలకొంది. గిఫ్ట్‌నిఫ్టీ సైతం నెగెటివ్‌గా ఉంది.

    Global Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    ఎస్‌అండ్‌పీ(S&P) 0.4 శాతం, నాస్‌డాక్‌ 0.22 శాతం నష్టపోయాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.05 శాతం నష్టంతో సాగుతోంది.

    Global Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.13 శాతం లాభాలతో ముగియగా.. సీఏసీ 1.61 శాతం, డీఏఎక్స్‌ 0.37 శాతం నష్టంతో ముగిశాయి.

    Global Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు మంగళవారం ఉదయం ఎక్కువగా నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో నిక్కీ(Nikkei) 1.05 శాతం, కోస్పీ 0.98 శాతం, హాంగ్‌సెంగ్‌ 044 శాతం, షాంఘై 0.34 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.32 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.16 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.31 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    Global Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు రెండోరోజూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత ట్రేడిరగ్‌ సెషన్‌లో నికరంగా రూ. 2,466 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐ(DII)లు నికరంగా రూ. 3,176 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.73 నుంచి 0.88 కు పెరిగింది. విక్స్‌(VIX) 0.26 శాతం పెరిగి 11.76 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.46 శాతం పెరిగి 68.48 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడి 87.58 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.30 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.24 వద్ద కొనసాగుతున్నాయి.

    రేర్‌ ఎర్త్‌ ఖనిజాలు ఇవ్వకపోతే 200 శాతం సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Trump) మరోసారి చైనా(China)పై బెదిరింపులకు దిగారు. అలాగే డిజిటల్‌ ట్యాక్స్‌లు విధించే దేశాలు అమెరికాకు చేసే ఎగుమతులపై ఆ ట్యాక్స్‌లు తొలగించకపోతే తదుపరి అదనపు సుంకాలు విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

    అమెరికా విధించిన అదనపు సుంకాలు రేపటినుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో మన ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే అవకాశాలున్నాయి.

    Latest articles

    Stock markets | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. భారీ నష్టాల్లో ప్రధాన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock markets | అమెరికా(America) విధించిన అదనపు సుంకాలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి....

    Khairatabad Ganesh | ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి.. ద‌ర్శ‌నానికి వెళ్లే వారికి అల‌ర్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khairatabad Ganesh | రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఖైరతాబాద్ (హైదరాబాద్) గణేశునికి ప్ర‌త్యేక గుర్తింపు...

    Excise Department | జ‌క్రాన్‌ప‌ల్లి శివారులో నాటుసారా ప‌ట్టివేత

    అక్షర టుడే, డిచ్‌పల్లి : Excise Department | మండ‌లంలోని క‌లిగోట్(Kaligot) గ్రామ శివారులో అబ్కారీ శాఖ అధికారులు...

    Bandi Sanjay | ఆయన వార్డు మెంబర్​గా కూడా గెలవలేరు.. పీసీసీ అధ్యక్షుడిపై బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | కేంద్ర మంత్రి బండి సంజయ్​ పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​గౌడ్​పై సంచలన...

    More like this