అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Markets | రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆగనందున భారత్‌పై కొత్త సుంకాలు(New tariffs) విధిస్తామన్న యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ(Profit booking)కు మొగ్గు చూపడంతో ప్రధాన సూచీలు నష్టపోయాయి. ప్రధానంగా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 122 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 124 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 367 పాయింట్లు పెరిగి లాభాలబాట పడుతున్నట్లు కనిపించినా.. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరిగి తిరిగి నష్టాలలోకి జారుకుంది. నిఫ్టీ(Nifty) 5 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే నష్టాల్లోకి జారుకుని 70 పాయింట్లు క్షీణించింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకుని 110 పాయింట్లు లాభపడిరది. మధ్యాహ్నం తర్వాత నిఫ్టీ సైతం నష్టాల బాట పట్టింది. చివరికి సెన్సెక్స్(Sensex) 322 పాయింట్ల నష్టంతో 85,439 వద్ద, నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో 26,250 వద్ద స్థిరపడ్డాయి.
Stock Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,723 కంపెనీలు లాభపడగా 2,545 స్టాక్స్ నష్టపోయాయి. 203 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 209 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 144 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 13 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 12 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Markets | కోలుకున్న ఎఫ్‌ఎంసీజీ సెక్టార్
ఎఫ్‌ఎంసీజీ సెక్టార్ రెండు సెషన్ల తర్వాత కోలుకుని లాభాల బాట పట్టింది. బీఎస్‌ఈలో రియాలిటీ (Realty) ఇండెక్స్ 2.16 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 1.25 శాతం, మెటల్ 0.58 శాతం, కమోడిటీ 0.56 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.51 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.40 శాతం లాభపడ్డాయి. ఐటీ(IT) ఇండెక్స్ 1.17 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.18 శాతం, ఎనర్జీ 0.95 శాతం, టెలికాం 0.81 శాతం, ఇన్‌ఫ్రా 0.50 శాతం నష్టపోయాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.28 శాతం నష్టపోగా.. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం పెరిగాయి.
Stock Markets | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభపడగా.. 14 కంపెనీలు నష్టపోయాయి. బీఈఎల్ 2.66 శాతం, హెచ్‌యూఎల్ 1.62 శాతం, టాటా స్టీల్ 1.66 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.53 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.45 శాతం లాభపడ్డాయి.
Stock Markets | Top losers..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.35 శాతం, ఇన్ఫోసిస్ 2.09 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.08 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.21 శాతం, టీసీఎస్ 1.09 శాతం నష్టపోయాయి.