HomeUncategorizedUS Visa | ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యార్థి వీసాల జారీ నిలిపివేత

US Visa | ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యార్థి వీసాల జారీ నిలిపివేత

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Visa | అమెరికా అధ్యక్షడు డోనాల్డ్​ ట్రంప్(US President Trump) ఈ మ‌ధ్య తీసుకుంటున్న నిర్ణ‌యాలు అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. తాజాగా అమెరికాలో( America) చదువుకోవాలనుకున్న విదేశీ విద్యార్థులకు పెద్ద షాక్ ఇచ్చాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.

తాజా నిర్ణయం ప్రకారం, విద్యార్థుల వీసాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ముఖ్యంగా F, M, J వీసాల కోసం కొత్తగా దరఖాస్తు చేసిన వారికి ఇది వర్తిస్తుంది. అయితే ఇప్పటికే ఇంటర్వ్యూకు అప్పాయింట్‌మెంట్ తీసుకున్నవారికి ఈ ఆంక్షలు వర్తించవు. విద్యార్థుల వీసాల (Student visa) జారీపై మరింత నిఘా పెట్టాల్సిందిగా సూచించారు. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు కూడా ఈ కొత్త మార్గదర్శకాలను గమనించాల్సిన అవసరం ఉంది.

US Visa | మ‌రో ప్ర‌క‌ట‌న‌..

భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీలల్లోనూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు జరగవు. విదేశీ విద్యార్థుల సోషల్‌ మీడియా (Social media) ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిబంధనలను తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ గైడ్ లైన్స్ us visa new guidelines వచ్చే వరకు అడిషనల్ స్టూడెంట్ లేదా ఎక్చ్సేంచ్ విజిటర్ వీసా అపాయింట్ మెంట్స్ రద్దు చేయాలని చెప్పింది. దీంతో అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు భారీ షాక్ తగలనుంది. భారత దేశం నుంచి అమెరికాకు వేలల్లో చదువుకోవడానికి వెళతారు. ఇప్పుడు వీసాలనే ఇవ్వకపోతే వారి ఆశలన్నీ అడియాశలు కావ‌డం ఖాయం.

మ‌రోవైపు అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ (Trump) ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. తరగతులకు గైర్హాజరయ్యే వారి వీసా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఇలాంటి వారంతా భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసా కోసమైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హతను కోల్పోతారని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది.

‘డ్రాపౌట్‌ అయినా, తరగతులు ఎగ్గొట్టినా, విద్యాసంస్థకు సమాచారం ఇవ్వకుండా స్టడీ ప్రోగ్రామ్‌ నుంచి వెళ్లిపోయినా మీ విద్యార్థి వీసా రద్దు అయ్యేఅవ‌కాశం ఉంది..’ అని అధికారులు తెలిపారు. వీసా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి’ అని ఆ ప్రకటనలో సూచించింది.