అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి భారత్‌పై సుంకాలు విధించారు. ఇప్పటికే వివిధ ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
ట్రంప్ గతంలోనే భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. ఇటీవల ఫార్మా ఉత్పత్తుల (Pharma Products)పై 100 శాతం టారిఫ్స్ ప్రకటించగా.. అక్టోబర్ 1 నుంచి అవి అమలులోకి రానున్నాయి. తాజాగా భారత సినిమాలపై ట్రంప్ సుంకాలు వేశారు. విదేశీ సినిమాలపై 100శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారతీయ సినిమాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి.
Trump Tariffs | ఆ చిత్రాలకు మినహాయింపు
డొనాల్డ్ ట్రంప్ విదేశీ సినిమాలపై 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు సోమవారం సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే అమెరికాలో నిర్మించే చిత్రాలకు ఆయన మినహాయింపు ఇచ్చారు. తమ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలించాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా సినీ రంగాన్ని ఆదుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.
Trump Tariffs | తెలుగు సినిమాలపై..
యూఎస్‌లోని దాదాపు 800 థియేటర్లలో తెలుగు సినిమాలు (Telugu Movies) విడుదల అవుతాయి. చాలా సినిమాలు అమెరికాలో రూ.కోట్లు వసూలు చేశాయి. అయితే ట్రంప్ తాజా నిర్ణయంతో టాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. దీంతో అమెరికాలో సినిమా విడుదల చేయాలంటే.. పంపిణీదారులు రూ.10 కోట్ల విలువైన హక్కులు కొనుగోలు చేస్తే.. మరో రూ.10 కోట్లు సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో టికెట్ రేట్లు పెరిగి ప్రేక్షకులపై సైతం భారం పడనుంది. ట్రంప్ తాజా నిర్ణయంతో భారత సినీ పరిశ్రమ ఆందోళన చెందుతోంది.