అక్షరటుడే, వెబ్‌డెస్క్: Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో (Venezuelan President Nicolás Maduro) పాటు ఆయన భార్యను అమెరికా సైన్యం తమ అదుపులోకి తీసుకుందని ప్రకటించారు.
తన సోషల్ మీడియా హ్యాండిల్ (social media handle) ట్రూత్‌లో విషయం వెల్లడించారు. వెనిజులాలో భారీ పేలుళ్లకు పాల్పడింది మేమేనని పేర్కొన్నారు. యూఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈ లార్జ్ స్కేల్ ఆపరేషన్ చేపట్టిందని తెలిపారు. ఈ అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ కేంద్రంగా వెనిజులా మారిందంటూ వ్యాఖ్యానించారు.
Donald Trump | వెనుజువెలాను లక్ష్యంగా చేసుకున్న అమెరికా
మాదకద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో కొంతకాలంగా వెనెజువెలాను అమెరికా లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో డ్రగ్స్‌ను తరలిస్తున్న పడవలతో పాటు జలాంతర్గాములపై దాడులు ముమ్మరం చేసింది. కాగా.. ఈ క్రమంలో ఇవాళ వెనెజువెలా రాజధాని అయిన కరాకస్‌లో ఏడు చోట్ల పేలుళ్లు సంభవించిన విషయం విదితమే.
