HomeUncategorizedIsrael - Iran | ఇజ్రాయెల్ దాడులకు ముందు ట్రంప్ పోస్టు వైరల్

Israel – Iran | ఇజ్రాయెల్ దాడులకు ముందు ట్రంప్ పోస్టు వైరల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Israel – Iran | ఇరాన్​లోని అణుస్థావరాలే లక్ష్యంగా గురువారం రాత్రి ఇజ్రాయెల్​(Israel) దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆపరేషన్​ రైజింగ్​ లయన్​ పేరిట చేపట్టిన ఈ దాడుల్లో ఇరాన్​కు తీవ్ర నష్టం కలిగింది. ఈ దాడుల్లో ఇరాన్​ పారామిలిటరీ రెవెల్యూషనరీ గార్డు చీఫ్​ మేజర్​ హొస్సేన్​ సలామీ(Hussain Salami) కూడా మరణించారు. ఈ దాడులపై స్పందిస్తూ అమెరికా అధికారులు తమ ప్రమేయం లేదని చెప్పారు.

అయితే ఇజ్రాయెల్​ దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (US President Donald Trump) చేసిన పోస్ట్​ వైరల్​గా మారింది. ఇరాన్​ రాజధాని టెహ్రన్(Tehran)​పై ఇజ్రాయెల్​ విరుచుకుపడింది. అణుస్థావరాలను ధ్వంసం చేసింది. అయితే ఈ దాడికి కొన్ని గంటల ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. ఇరాన్ గొప్ప దేశమే కావొచ్చు.. కానీ అణ్వాయుధాలు కలిగి ఉండాలనే ఆశను వదులుకోవాలని అందులో పేర్కొన్నారు. ఇరాన్ న్యూక్లియర్ సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా.. ఆయన పోస్టు పెట్టిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్​ దాడులకు పాల్పడడం గమనార్హం.

Israel – Iran | ఇరుదేశాల్లో అప్రమత్తత

దాడుల అనంతరం ఇరాన్​, ఇజ్రాయెల్​ దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ తమ గగనతలాన్ని మూసివేసింది. ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించింది. మరోవైపు తాము చేసిన దాడులకు ఇరాన్(Iran)​ ప్రతిదాడులు చేయవచ్చని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. అందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. దీంతో మరో యుద్ధం ప్రారంభం అవుతుందేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

Must Read
Related News