అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nobel Prize | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఆవిరయ్యాయి. నోబెల్ శాంతి బహుమతి 2025 వెనుజులాకు చెందిన పార్లమెంట్ సభ్యు రాలు మరియా కొరినా మాచాడోను వరించింది. ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ(Norwegian Nobel Committee) శుక్రవారం ప్రకటించింది.
ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ఈ యేడుమొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ కాగా.. అకాడమీ సభ్యులు మరియా వైపు మొగ్గుచూపారు. మరియా డమోక్రటిక్ రైట్స్, శాంతి కోసం ఎంతో కృషి చేసింది. వెనిజులాను డిక్టేటర్ షిప్ నుంచి ప్రజాస్వామం దిశగా నడిపించింది.
Nobel Prize | వెనెజువెలా పార్లమెంట్ సభ్యురాలిగా..
మరియా(Maria Corina) 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె వెనెజువెలా పార్లమెంట్ సభ్యురాలిగా, దేశ విపక్ష నేతగా కొనసాగుతోంది. ఆ దేశ ప్రజల హక్కుల కోసం చేస్తున్న అవిశ్రాంత పోరాటాన్ని గుర్తించి మచాడోకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం ఆమె కృషి చేయగా.. ఎన్నో బెదిరింపులు ఎదుర్కొంది. అంతేకాకుండా.. ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించింది.
Nobel Prize | ట్రంప్‌నకు బిగ్ షాక్
నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎన్నో ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందు కోసం ఆయన వివిధ దేశాల నుంచి నామినేట్ చేయించుకున్నారు. ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ పదేపదే చెప్పుకున్నారు. అయినా ఆయనకు నోబెల్ బహుమతి దక్కలేదు. నోబెల్ పీస్ ప్రైజ్(Nobel Peace Prize)ను శుక్రవారం ప్రకటించనున్న నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది యుద్ధాలు నిలువరించిన తనకు నోబెల్ బహుమతి వస్తుందో రాదోనని వ్యాఖ్యానించారు.
Nobel Prize | ఇప్పటి వరకు 105 సార్లు..
నోబెల్ పీస్ అవార్డును 1901 నుంచి అందిస్తున్నారు. ఇప్పటి వరకు 105 సార్లు ప్రకటించారు. ఇప్పటి వరకు 111 మంది వ్యక్తులు, 31 సంస్థలు పురస్కారాన్ని అందుకున్నాయి. కాగా.. ఈ బహుమతి అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా పాకిస్థాన్‌కు చెందిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ నిలవగా.. 86 ఏళ్ల వయసులో జోసెఫ్ రాట్‌బ్లాట్ దీనిని అందుకున్నారు.