HomeUncategorizedUS President Trump | టెక్ దిగ్గ‌జాల‌తో ట్రంప్ విందు.. ఎంత పెట్టుబ‌డి పెడ‌తారని ప్ర‌శ్న‌

US President Trump | టెక్ దిగ్గ‌జాల‌తో ట్రంప్ విందు.. ఎంత పెట్టుబ‌డి పెడ‌తారని ప్ర‌శ్న‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US President Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ దిగ్గ‌జాల‌కు విందు పేరిట వ్యాపార చ‌ర్చ‌లు జ‌రిపారు. విదేశాల్లో పెట్టుబ‌డులు పెట్టింద‌ని చాల‌న్న ట్రంప్‌.. స్వ‌దేశంలో ఎంత పెట్టుబ‌డులు పెడ‌తార‌ని ప్ర‌శ్నించారు.

వైట్ హౌస్‌లో ఉన్నత స్థాయి టెక్ ఎగ్జిక్యూటివ్‌ల బృందానికి ఆతిథ్యం ఇచ్చిన అధ్య‌క్షుడు.. కృత్రిమ మేధస్సుపై అమెరికా దృష్టి పెరుగుతోందన్నారు. కృత్రిమ మేధలో (artificial intelligence) ప‌రిశోధ‌న‌లు, పెట్టుబడులు మన దేశాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే ముందడుగు అని అభివర్ణించారు. అతిథులను అధిక ఐక్యూ క‌లిగిన వ్యక్తులని అభివర్ణించిన ట్రంప్ (US President Donald Trump) పెట్టుబ‌డుల గురించి ప్ర‌స్తావించారు.

US President Trump | మ‌స్క్‌కు అంద‌ని ఆహ్వానం

పెద్ద పెద్ద టెక్ దిగ్గ‌జాలు పాల్గొన్న ఈ భేటీకి టెస్లా సీఈవో ఎల‌న్ మస్క్‌కు (Tesla CEO Elon Musk) మాత్రం ఆహ్వానం అంద‌లేదు. ఒక‌ప్ప‌టి ట్రంప్ స‌న్నిహితుడు, ప్ర‌భుత్వంలో కీల‌కమైన డోజ్ విభాగానికి నేతృత్వం వహించిన మ‌స్క్‌కు ఆహ్వానం ద‌క్క‌క‌పోవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అదే స‌మ‌యంలో కృత్రిమ మేధస్సులో మస్క్ ప్రత్యర్థులలో ఒకరైన ఓపెన్​ ఏఐకి చెందిన సామ్ ఆల్ట్‌మాన్​ను పిల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai), మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, మైక్రాన్ సంజయ్ మెహ్రోత్రా, టిమ్కో సాఫ్ట్‌వేర్ వివేక్ రణదివే, పలంతిర్ శ్యామ్ శంకర్ త‌దిత‌రులు ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates), గూగుల్ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మాన్, ఒరాకిల్ సీఈవో సఫ్రా కాట్జ్, బ్లూ ఆరిజిన్ సీఈవో డేవిడ్ లింప్, స్కేల్ ఏఐ వ్యవస్థాపకుడు అలెగ్జాండర్ వాంగ్, షిఫ్ట్ 4 పేమెంట్స్ సీఈవో జారెడ్ ఐజాక్‌మాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

US President Trump | ఎంత పెట్టుబ‌డి పెడ‌తారు?

టెక్ కంపెనీల (tech companies) సీఈవోల‌పై ప్ర‌శంస‌లు కురిపించిన ట్రంప్ చివ‌ర‌కు డాలర్ సంకేతాలపై దృష్టి పెట్టారు. దేశంలో ఎంత పెట్టుబడి పెడుతున్నారని ప్ర‌శ్నించారు. టిమ్‌.. అమెరికాలో ఎంత పెట్టుబ‌డులు పెడ‌తారు. మీరు బాగానే పెడ‌తార‌ని తెలుసు అని యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను (Apple CEO Tim Cook) ప్ర‌శ్నించారు. ఇప్ప‌టిదాకా విదేశాల్లో పెట్టుబ‌డులు పెట్టింది చాలని, ఇక స్వ‌దేశానికి రండి అని సూచించారు. దీంతో 600 బిలియ‌న్ డాల‌ర్లు పెడ‌తామ‌ని కుక్ బ‌దులిచ్చారు. జుక‌ర్‌బ‌ర్గ్‌ను కూడా ట్రంప్ పెట్టుబ‌డుల గురించి అడిగితే 800 బిలియ‌న్ డాల‌ర్లు ఇన్వెస్ట్ చేస్తామ‌ని చెప్పారు. అలాగే ఏటా 60 బిలియ‌న్లు పెట్టుబడి పెడ‌తామ‌ని స‌త్య‌నాదేళ్ల తెలిపారు.

Must Read
Related News