ePaper
More
    Homeఅంతర్జాతీయంStudent Visa | విదేశీ విద్యార్థులకు ట్రంప్ మరో షాక్.. అమెరికాకు వచ్చే వారికి కాల...

    Student Visa | విదేశీ విద్యార్థులకు ట్రంప్ మరో షాక్.. అమెరికాకు వచ్చే వారికి కాల పరిమితి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Student Visa | విదేశీ విద్యార్థులపై మరోమారు ఆంక్షల కొరఢా ఝళిపించేందుకు అమెరికా (America) సిద్ధమవుతోంది.

    ఇప్పటికే స్టూడెంట్ వీసాల (student visa) జారీని కఠినతరం చేసిన ట్రంప్ (Donald Trump) పాలకవర్గం.. ఇప్పుడు విదేశీ విద్యార్థులపై కాల పరిమితి విధించేందుకు సన్నాహాలు చేస్తోంది. విదేశీ విద్యార్థులు (foreign students), సందర్శకులు అగ్రరాజ్యంలో ఎంతకాలం ఉండవచ్చనే వివాదాస్పద నిబంధనను తీసుకురావాలని ప్రతిపాదించింది. ఇది విదేశీయులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థులకు జారీ చేసే వీసాలపై సోషల్ మీడియా (Social Media) వెట్టింగ్ నిబంధనను తీసుకొచ్చిన అగ్రరాజ్యం.. ఇప్పుడు కాల పరిమితి విధించాలని యోచిస్తుండడం లక్షలాది మందిపై ప్రభావం చూపనుంది.

    Student Visa | వలసలపై ట్రంప్ కఠిన వైఖరి..

    అక్రమ వలసదారులను అడ్డుకోవడం, అమెరికాలోని క్యాంపస్ లలో యూదు వ్యతిరేకతను తొలగించడంపై ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలోనే విదేశీ విద్యార్థులపై కాల పరిమితి విధించాలన్న ప్రతిపాదనను తాజాగా తెరపైకి తీసుకొచ్చారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో 2020లో ప్రతిపాదించిన ఈ ప్రణాళిక, ప్రస్తుత సౌకర్యవంతమైన విద్యార్థి వీసా వ్యవస్థను (student visa system) నిర్ణీత కాలంతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఇది అమలులోకి వస్తే విదేశీ వీసాపై గడువు విధించనున్నారు. ఆ సమయం వరకే విదేశీయులు అగ్రరాజ్యంలో ఉండేందుకు అవకాశం కల్పిస్తారు.

    Student Visa | అనుమతి పరిమిత కాలమే..

    ప్రస్తుతం F-1 వీసాలు కలిగి ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, J-1 వీసాలపై (F-1 visas) ఎక్స్ఛేంజ్ సందర్శకులు ‘హోదా వ్యవధి’ని మంజూరు చేస్తున్నారు. ఇది విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ సందర్శకులు, విదేశీ మీడియా (foreign media) ప్రతినిధులు ఎంతకాలం కావాలంటే అంతకాలం అమెరికాలో ఉండడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే, ట్రంప్ పాలకవర్గం తెచ్చిన కొత్త ప్రతిపాదనతో.. ఇలాంటి వీసాలు ఉన్న వారు ఇక నుంచి నిర్ణీత కాల పరిమితి వరకు అగ్రరాజ్యంలో ఉండవచ్చు. ఆ తర్వాత ఉండాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. అయితే, ప్రస్తుతం హోంల్యాండ్ సెక్యూరిటీ (v) విభాగం ఆఫీస్ ఆఫ్ మేనేజ్​మెంట్​ అండ్ బడ్జెట్ సమీక్ష కోసం ప్రతిపాదించిన ఈ కొత్త విధానం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...