అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump Tariffs Suspended | ప్రతీకార సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన టారిఫ్‌లను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా టారిఫ్‌లను ఈ నెల 24 నుంచి వసూలు చేయమని అమెరికా కస్టమ్స్ విభాగం తెలిపింది.
ట్రంప్ టారిఫ్‌లు (Trump Tariffs) చట్ట విరుద్ధమని కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. న్యాయస్థానం మూడు రోజుల క్రితం టారిఫ్‌లను రద్దు చేసినా.. అమెరికా ప్రభుత్వం మాత్రం వాటిని వసూలు చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం నుంచి సుంకాల వసూలును నిలిపి వేస్తామని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద విధించిన సుంకాల వసూళ్లను మంగళవారం ఉదయం 12:01 గంటలకు నిలిపివేస్తామని US కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (Border Protection) ఏజెన్సీ తెలిపింది.
Trump Tariffs Suspended | 15 శాతం టారిఫ్‌లు
అమెరికా (America) ఆయా దేశాలపై విధించిన సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ట్రంప్ వాటిని భర్తీ చేయడానికి 15 శాతం టారిఫ్‌లు విధించారు. వేరే చట్టపరమైన అధికారం కింద కొత్తగా 15 శాతం గ్లోబల్ టారిఫ్‌ను విధించారు. కాగా భారత్‌పై గతంలో 50 శాతం సుంకాలను ట్రంప్ విధించారు. ఇటీవల వాణిజ్య ఒప్పందం తర్వాత అది 18శాతానికి తగ్గినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సుంకాలు కూడా ఉండవు. అయితే గ్లోబల్ టారిఫ్ (Global Tariff) పేరుతో 15 శాతం సుంకాలు అన్ని దేశాలపై అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సుంకాలను మంగళవారం నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. దీంతో గ్లోబల్ టారిఫ్‌లు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయన్నది ఇంకా తెలియరాలేదు. గ్లోబల్ టారిఫ్‌లు అమలులోకి వస్తే భారత్‌పై సుంకాలు 50 శాతం నుంచి 15శాతానికి తగ్గనున్నాయి.
