అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump tariffs | అమెరికా America అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ Trump నకు వ్యతిరేకంగా యూఎస్ సుప్రీంకోర్టు US Supreme Court సంచలన తీర్పునిచ్చింది. ప్రపంచం World లోని పలు దేశాలపై అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు (పన్నులు) చెల్లవని స్పష్టం చేసింది. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలు చట్టవిరుద్ధమని పేర్కొంది. ఇది అధ్యక్షుడు తన అధికారు పరిధిని దాటినట్లే అని సుప్రీం కోర్టు చెప్పుకొచ్చింది.
Trump tariffs | చాలా అవమానం
యూఎస్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అమెరికా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సుప్రీం తీర్పుపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. వైట్ హౌస్‌లో గవర్నర్లతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టును “చాలా అవమానం”గా వర్ణించారు. దీనికితోడు తన వద్ద మరో ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉన్నట్లు ట్రంప్ చెప్పారని అంతర్జాతీయ మీడియా కథనం ప్రచురించింది. కాగా, ట్రంప్‌నకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన సమయంలో సదరు ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు తీర్పును సమర్థించగా.. ముగ్గురు మాత్రం వ్యతిరేకించారు.
Trump tariffs | అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే చట్టం
అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్.. ప్రపంచంలోని పలు దేశాలపై ఇష్టానుసారం సుంకాలు వేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై యూఎస్ సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఇతర కంట్రీలపై భారీ టారీఫ్‌లు వేసేందుకు అధ్యక్షుడు ట్రంప్‌నకు చట్టబద్ధమైన అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రపంచ దేశాలపై సుంకాలు వేయడం సరికాదన్నారు. ఇది అధికార దుర్వినియోగమేనని సుప్రీం పేర్కొంది.
ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించడం సరైన నిర్ణయం కాదని ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం (6–3 మెజారిటీ) తీర్పు నిచ్చింది. కాగా, తన వద్ద ప్రత్యామ్నాయ ప్లాన్ ఉందని ట్రంప్ పేర్కొనడం ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ట్రంప్ ప్లాన్ బీ ఏమిటా అని ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి.