Trump tariff | మళ్లీ టెంపర్​ చూపిన ట్రంప్​.. 10 శాతం సుంకాన్ని 15 శాతానికి పెంపు!

Date:

Share post:

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump tariff | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ America President Donald Trump ప్రపంచవ్యాప్తంగా విధించిన సుంకాలను శుక్రవారం యూఎస్​ సుప్రీంకోర్టు US Supreme Court రద్దు చేసిన తర్వాత, అనేక దేశాలు, ఆర్థిక నిపుణులు స్పందించారు.

తనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన న్యాయమూర్తులను “మన రాజ్యాంగానికి నమ్మకద్రోహులు”, “లాప్‌డాగ్‌లు” అని ట్రంప్​ అభివర్ణించడం సరికాదని ప్రపంచ దేశాలు ఖండించాయి.

కాగా, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, విదేశీ వస్తువులపై 10% సుంకం విధిస్తూ.. కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్​ సంతకం చేశారు. ఓవల్ కార్యాలయంలో శుక్రవారం సదరు ఉత్తర్వుపై సంతకం చేశారు. అయితే, శనివారం, సదరు సుంకాలను 15 శాతానికి పెంచడం గమనార్హం.

Trump tariff | చీఫ్​ జస్టిస్​ ఏమన్నారంటే..

సుప్రీంకోర్టు తీర్పులో చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ Chief Justice John Roberts ఈ విధంగా రాసుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్​ తన చట్టపరమైన అధికారాలను మీరారని అన్నారు. అలా చేయాలంటే ట్రంప్‌నకు “స్పష్టమైన కాంగ్రెస్ అనుమతి” అవసరమని రాబర్ట్స్ పేర్కొన్నారు.

1977 చట్టాన్ని ఉపయోగించి, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) ద్వారా సుమారు అన్ని వాణిజ్య భాగస్వాముల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందకుండానే ట్రంప్ పన్నులు విధించారు.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత విదేశీ వస్తువులపై ట్రంప్ శుక్రవారం 10% ప్రపంచ సుంకాన్ని విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. తర్వాత శనివారం దానిని 15 శాతానికి పెంచారు.

Related articles

Cancer | స్టేజ్-1 లో గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించడం తేలిక.. ఈ లక్షణాలు ఉన్నాయా..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cancer | క్యాన్సర్ అనగానే మనలో చాలామంది భయపడతారు. కానీ నిజానికి ఈ మహమ్మారిని మొదటి దశలోనే (Stage 1) గుర్తిస్తే,...

Kamareddy SP Rajesh Chandra | కామారెడ్డిలో కారు దహనం కేసులో ఇద్దరి అరెస్ట్..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP Rajesh Chandra | కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి కారుకు బీజేపీ...

TG RERA Notices Builders | పలువురు బిల్డర్లు, డెవలపర్లకు రెరా నోటీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TG RERA Notices Builders | నిబంధనలు పాటించని పలువురు బిల్డర్లు, డెవలపర్లకు తెలంగాణ రియల్​ ఎస్టేట్​ రెగ్యూలేటరి అథారిటీ...

NSUI Sandeep vs KVR | కామారెడ్డిలో అల్లకల్లోలం సృష్టించింది ఎమ్మెల్యేనే..: ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్

అక్షరటుడే, కామారెడ్డి: NSUI Sandeep vs KVR | కామారెడ్డి పట్టణంలో ఇంతలా అల్లకల్లోలం కావడానికి కారణం ఎమ్మెల్యే కేవీఆర్ (MLA KVR)​ అని...