ePaper
More
    Homeఅంతర్జాతీయంTrump tariff | ట్రంప్ మామ.. కొత్త సినిమా.. విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్

    Trump tariff | ట్రంప్ మామ.. కొత్త సినిమా.. విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump tariff | ప్రపంచ దేశాలపై సుంకాలతో tariffs విరుచుకుడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ US President Donald Trump.. తాజాగా మరో బాంబు పేల్చారు.

    ఈ సారి సినీ ఇండస్ట్రీని film industry లక్ష్యంగా చేసుకున్న ఆయన.. విదేశాలలో నిర్మించే చిత్రాలపై 100 శాతం సుంకాన్ని ప్రకటించారు. ఇతర దేశాల కారణంగా అమెరికా సినీ పరిశ్రమ america film industry చాలా వేగంగా చనిపోతుందని ఆయన పేర్కొన్నారు. “ఇతర దేశాలు మన చిత్ర నిర్మాతలను, స్టూడియోలను film producers and studios యునైటెడ్ స్టేట్స్ నుండి దూరం చేయడానికి అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

    దీంతో హాలీవుడ్తో hollywood పాటు అమెరికాలోని america అనేక ఇతర ప్రాంతాలు నాశనమవుతున్నాయి. ఇది ఇతర దేశాల సమిష్టి ప్రయత్నం. ఇది జాతీయ భద్రతకు ముప్పు” అని తన సోషల్ మీడియా social media ట్రూత్లో పోస్ట్ చేశారు. విదేశాలలో నిర్మించి మన దేశంలోకి వచ్చే ఏవైనా సరే అన్ని సినిమాలపై 100% సుంకాన్ని విధించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వాణిజ్య శాఖ. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ United States Trade ప్రతినిధికి అధికారమిస్తున్నానని ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో మళ్లీ సినిమాలు నిర్మించాలనుకుంటున్నామని తెలిపారు.

    Trump tariff | మన సినిమాలపై ప్రభావం..

    ట్రంప్ తాజా నిర్ణయం Trump latest decision మిగతా దేశాలపై ఎలా ఉన్నా భారతీయ చలనచిత్ర పరిశ్రమ మీద మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఇండియాకు సంబంధించి ఎన్నో విజయవంతమైన చిత్రాలు అమెరికాలో america ప్రేక్షకుల మది దోచాయి. బాహుబలి, పుష్ప Baahubali and Pushpa వంటివి రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించాయి. బాలివుడ్ bollywood, హాలివుడ్ hollywood, మాలివుడ్ mollywood సినిమాలకు అక్కడ మంచి ఆదరణ లభిస్తుంది. అయితే, ట్రంప్ సుంకాలతో రానున్న రోజుల్లో మన చిత్ర పరిశ్రమకు గడ్డు కాలమేనని భావిస్తున్నారు.

    ట్రంప్ తాజాగా చెబుతున్న టారిఫ్లు tarrifs విదేశాలలో చిత్రాలను నిర్మించే నిర్మాణ సంస్థల, విదేశీ లేదా అమెరికన్లను foreign or American లక్ష్యంగా చేసుకుంటుందా అనేది స్పష్టంగా తెలియలేదు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో చైనా china తన దిగుమతి చేసుకునే అమెరికా చిత్రాల American films సంఖ్యను మధ్యస్థంగా తగ్గిస్తామని ప్రకటించిన దాదాపు నెల రోజుల తర్వాత ట్రంప్ ఈ చర్య తీసుకోవడం గమనార్హం.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...