HomeUncategorizedDonald trump | భారత్​ – పాక్​ మధ్య దాడులు.. ట్రంప్​ సంచలన ప్రకటన

Donald trump | భారత్​ – పాక్​ మధ్య దాడులు.. ట్రంప్​ సంచలన ప్రకటన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Donald trump | పహల్​గామ్​ ఉగ్రదాడికి (pahalgam terrorist attack) ప్రతీకారంగా భారత్​ ‘ఆపరేషన్​ సింధూర్​’ను చేపట్టింది. ఇందులో భాగంగా పాక్​లోని టెర్రరిస్ట్​ క్యాంపులే (pakistan terrorist camps) లక్ష్యంగా దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత మూడు రోజులుగా భారత్​పై పాక్​ దాడులు (pakistan attacks on india) చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిని భారత్​ సమర్థంగా తిప్పికొడుతోంది. రిటాలియేషన్​లో భాగంగా భారత్​ సైతం (indian army) పాక్​లోని పలుచోట్ల దాడులు చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది.

కాగా.. భారత్​ – పాక్​ మధ్య దాడులు (india – pakistan attacks) కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్​ ట్రంప్​ (donald trump) సంచలన ప్రకటనల చేశారు. తక్షణ సీజ్​ఫైర్​కు రెండు దేశాలు అంగీకరించాయని పేర్కొన్నారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపారు. ఇందుకోసం రెండు దేశాలతో సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు. భారత్​ ‌– పాక్​ (india-pakistan) సమయస్ఫూర్తితో వ్యవహరించాయని చెప్పారు. రెండు దేశాలకు అభినందనలు తెలుపుతూ ‘ట్రూత్​’, ‘ఎక్స్​’లో పోస్టు పెట్టారు.

Must Read
Related News