HomeUncategorizedDonald Trump | గుడ్​ న్యూస్​ చెప్పిన ట్రంప్​.. బంగారంపై సుంకం ఉండదని ప్రకటన

Donald Trump | గుడ్​ న్యూస్​ చెప్పిన ట్రంప్​.. బంగారంపై సుంకం ఉండదని ప్రకటన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ ఇటీవల భారత్​పై 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 25 శాతం టారిఫ్స్​ అమలులోకి రాగా.. ఈ నెల 27 నుంచి మరో 25 శాతం అమలులోకి రానున్నాయి. వీటి ప్రభావంతో భారత్​ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఫలితంగా భారత కంపెనీల (Indian Company) నుంచి ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. అయితే ట్రంప్​ తాజాగా భారతీయులకు బంగారం లాంటి శుభవార్త చెప్పారు.

టారిఫ్​లతో (Tariffs) భయపెడుతున్న ట్రంప్​ తన సోషల్​ మీడియా వేదిక ట్రూత్​ వేదికగా మంగళవారం కీలక ప్రకటన చేశారు. బంగారంపై ఎలాంటి సుంకం విధించమని ఆయన ప్రకటించారు. ఇటీవల ట్రంప్​ టారిఫ్​లు విధించడంతో బంగారంపై కూడా సుంకాలు పెంచుతారని వార్తలు వచ్చాయి. దీంతో బంగారం ధరలు (Gold Rates) భారీగా పెరిగాయి. అయితే తాజాగా ట్రంప్​ బంగారాన్ని సుంకాల యుద్ధం నుంచి దూరంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

Donald Trump | ధరలు తగ్గే అవకాశం

వారం రోజులుగా ట్రంప్​ బంగారంపై సుంకాలు విధిస్తారనే ఊహాగనాలు వినిపిస్తున్నాయి. దీంతో రేట్లు పెరిగాయి. అయితే ట్రంప్ స్వయంగా బంగారంపై సుంకాలు విధించమని పోస్ట్​ చేయడంతో పుకార్లకు తెరపడింది. బంగారంపై సుంకం ఉంటుందనే వార్తల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టేవారు, బంగారం వ్యాపారులు ఆందోళన చెందారు.

మరోవైపు భారతీయులు (Indians) బంగారు ఆభరణాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. సుంకాలు విధిస్తే భారత్​పై తీవ్ర ప్రభావం ఉండేది. అయితే ట్రంప్​ తాజా నిర్ణయంతో గత కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. కాగా ట్రంప్​ ఇటీవల భారత్​, బ్రెజిల్ లాంటి దేశాలపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి ఆయిల్​ కొనుగోలు చేస్తున్నామనే కారణంతో సుంకాలు విధించారు. అయితే బంగారంపై సుంకాలు లేవని ప్రకటించడంతో బంగారం వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగితే తమ వ్యాపారంపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన చెందారు.