HomeUncategorizedIsrael-Iran Conflict | ఆగ‌మేఘాల‌పై అమెరికాకు ట్రంప్‌.. ఇజ్రాయెల్‌-ఇరాన్ ఉద్రిక్త‌త‌లే కార‌ణం

Israel-Iran Conflict | ఆగ‌మేఘాల‌పై అమెరికాకు ట్రంప్‌.. ఇజ్రాయెల్‌-ఇరాన్ ఉద్రిక్త‌త‌లే కార‌ణం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Israel-Iran Conflict | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) త‌న కెన‌డా ప‌ర్య‌ట‌నను కుదించుకున్నారు. గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు కెన‌డా వెళ్లిన ఆయ‌న‌.. త‌న ప‌ర్య‌ట‌నను ఒక‌రోజు ముందుగానే అమెరికాకు తిరిగి బ‌య‌ల్దేరారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన హుటాహుటిన తిరిగి వ‌స్తున్నారు. వ‌చ్చీ రాగానే ఆయ‌న భ‌ధ్ర‌తా మండ‌లితో స‌మావేశం కానున్నారు. ఇజ్రాయెల్‌(Israel)లోని అమెరికా ఎంబ‌సీపై ఇరాన్ క్షిప‌ణి దాడి చేసిన నేప‌థ్యంలో ఆయ‌న కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉందని భావిస్తున్నారు. భౌగోళిక రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తూ టెహ్రాన్‌(Tehran)ను వెంటనే ఖాళీ చేయాలని ట్రంప్ ప్రకటన చేయడంతో ఈ నిర్ణయం వెలువడింది. మంగళవారం కూడా శిఖరాగ్ర సమావేశం కొనసాగనుంది. దీని త‌ర్వాత ట్రంప్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించిన అనంత‌రం కెనడా(Canada) నుంచి బయలుదేరాల్సి ఉంది. అలాగే కెనడాలో ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా ఆయన సమావేశం కావాల్సి ఉంది.

ఇజ్రాయెల్‌, ఇరాన్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ట్రంప్ త‌న ప‌ర్య‌ట‌న‌ను కుదించుకుని తిరిగి వ‌స్తున్నార‌ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్(Carolyn Leavitt) తెలిపారు. కెనడాలోని కననాస్కిస్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశం నుంచి వెన‌క్కి రావాల‌న్న ట్రంప్ నిర్ణ‌యం గురించి ఆయ‌న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “అధ్యక్షుడు ట్రంప్ G7లో గొప్ప రోజు గడిపారు. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌(UK Prime Minister Keir Starmer)తో కూడా ఒక ప్రధాన వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారు. కానీ మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా కారణంగా ట్రంప్ ఈ రాత్రి దేశాధినేతలతో విందు తర్వాత బయలుదేరుతారు” అని లీవిట్ ‘X’లో రాశారు.


Israel-Iran Conflict | ప్రతి ఒక్కరూ టెహ్రాన్‌ను ఖాళీ చేయాలి: ట్రంప్

టెహ్రాన్‌ను వెంట‌నే ఖాళీ చేయాల‌ని ట్రంప్ సూచించారు. ఈ నేప‌థ్యంలో అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగుతుంద‌న్న సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ప్రతి ఒక్కరూ వెంటనే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలని హెచ్చరించిన ట్రంప్‌.. ఇరాన్ అమెరికాతో అణు ఒప్పందంపై సంతకం చేసి ఉండాల్సింద‌ని పునరుద్ఘాటించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఆయ‌న వ‌రుస పోస్టులు చేశారు. ఇరాన్ అణు ఆశయాలపై తన దీర్ఘకాల వైఖరిని గట్టిగా పునరుద్ఘాటిస్తూ, తీవ్రమైన పరిణామాల గురించి హెచ్చరించారు. “నేను సంతకం చేయమని చెప్పిన ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాలి. మానవ జీవితాన్ని వృథా చేయడం ఎంత అవమానకరం. ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ తక్షణ చర్య తీసుకోవాలని” ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై తన దృఢమైన వైఖరిని మ‌రోసారి పున‌రుద్ఘాటించారు. టెహ్రాన్‌లో దాదాపు 10 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు, మెట్రోపాలిటన్ ప్రాంతంలో దాదాపు 17 మిలియన్లు ఉన్నారు.

Must Read
Related News