ePaper
More
    Homeఅంతర్జాతీయంDonald Trump | కెన‌డాపై ట్రంప్ రుసరుస‌.. ట్రేడ్ చ‌ర్చ‌లు నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌

    Donald Trump | కెన‌డాపై ట్రంప్ రుసరుస‌.. ట్రేడ్ చ‌ర్చ‌లు నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | కెన‌డా వ్య‌వ‌హార శైలిపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ దేశం విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్‌(Digital Service Tax)పై ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కెన‌డా(Canada)తో వాణిజ్య చ‌ర్చ‌లు అంత సులువు కాద‌ని పేర్కొన్న ఆయ‌న‌.. ఆ దేశంతో చ‌ర్చ‌ల‌ను నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అమెరికన్ కంపెనీలపై విధిస్తున్న డిజిటల్ ట్యాక్స్‌ను ఆయ‌న దాడిగా అభివర్ణించారు. ఇందుకు ప్ర‌తిగా కెనడాపై తాము కూడా సుంకాలు విధిస్తామన్నారు. త్వరలో ఈ వివరాలు వెల్లడిస్తానని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్​లో పేర్కొన్నారు. కెనడాలో 20 మిలియన్ డాలర్లకు మించి రెవెన్యూ ఉన్న అమెరికా టెక్ సంస్థలపై కెనడా డిజిటల్ సర్వీస్ పన్ను విధిస్తోంది. దీంతో, యాపిల్, అమెజాన్, మెటా లాంటి సంస్థలు మూడు శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. గతేడాది ఈ పన్నును అమల్లోకి తెచ్చారు. రెట్రోస్పెక్టివ్‌గా దీన్ని 2022 నుంచి వర్తిస్తామని కెనడా ప్రభుత్వం పేర్కొంది. ఈ నెలాఖ‌రులోపు అమెరికా కంపెనీలు 2 బిలియ‌న్ డాల‌ర్ల మేర ప‌న్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ట్రంప్ నుంచి తాజా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

    Donald Trump | ఇరు దేశాల మధ్య ప్ర‌తిష్టంభ‌న‌

    ట్రంప్ రెండో సారి అధికారంలోకి వ‌చ్చాక.. వివిధ దేశాలు విధిస్తున్న ప‌న్నుల‌పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఆయా దేశాల‌పై సుంకాల కొర‌డా ఝ‌ళిపించారు. కొన్నాళ్లు తాన్ని అబేయ‌న్స్‌లో పెట్టి, వాణిజ్య చ‌ర్చ‌ల‌కు తెర లేపారు. కెనడా విధిస్తున్న డిజిట‌ల్ స‌ర్వీస్ ట్యాక్స్‌పై ట్రంప్ మొదటి నుంచీ గుర్రుగా ఉన్నారు. అమెరికా(America)కు కెనడా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గతేడాది ఇరు దేశాల మధ్య 760 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వాణిజ్య లోటును పూడ్చుకునేందుకు కెనడాపై భారీగా సుంకాలు విధించారు.

    ఆ తరువాత సుంకాల విధింపును తాత్కాలికంగా పక్కనపెట్టి కెనడాతో చర్చలు మొదలెట్టారు. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరకు వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు వెల్లడించారు. ‘ఇది చాలా దారుణమైన పన్ను, అందుకే కెనడాతో వాణిజ్య చర్చలన్నిటికీ తక్షణం ముగింపు పలుకుతున్నాము. కెనడాతో వాణిజ్యం చాలా కష్టం. వారు తమ తీరు మార్చుకునే వరకూ ఎలాంటి చర్చలూ ఉండవు’ అని ట్రంప్ ప్ర‌క‌టించారు. “ఈ దారుణమైన పన్ను ఆధారంగా, కెనడాతో వాణిజ్యంపై అన్ని చర్చలను మేము వెంటనే రద్దు చేస్తున్నాము. రాబోయే ఏడు రోజుల వ్యవధిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(United States of America)తో వ్యాపారం చేయడానికి వారు చెల్లించాల్సిన సుంకాన్ని మేము కెనడాకు తెలియజేస్తామని” తెలిపారు.

    Donald Trump | చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌న్న కెన‌డా

    అమెరికా అధ్య‌క్షుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన త‌రుణంలో కెనడా ఆచితూచి స్పందించింది. ఆ దేశంతో చ‌ర్చ‌ల‌ను పున‌రుద్ధ‌రించుకుంటామ‌ని పేర్కొంది. ‘కెనడా వర్కర్లు,(Canada Workers) వ్యాపారాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమెరికాతో ఈ సంక్లిష్ట వాణిజ్య చర్చల్లో పాల్గొంటాము’ అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ కార్యాలయం(Canada PM Mark Carney) ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి జీ7 సమ్మిట్‌లో కూడా ఇరు దేశాలు మధ్య వాణిజ్యం చర్చకు వచ్చింది. ఆమోదయోగ్యమైన వాణిజ్య ఒప్పందాన్ని 30 రోజుల్లో కుదుర్చుకోవాలని ట్రంప్, కార్నీ అంగీకరించారు. ఇంతలోనే చర్చలకు ముగింపు పడటంతో మళ్లీ వివాదం మొదటికి వచ్చినట్టైంది.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...