ePaper
More
    HomeజాతీయంDonald Trump | పోప్ అవతారంలో ట్రంప్.. సోషల్ మీడియాలో వైరల్​

    Donald Trump | పోప్ అవతారంలో ట్రంప్.. సోషల్ మీడియాలో వైరల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోప్(Trump as Pope) అవతారం ఎత్తారు. పోప్​ అవతారంలో ఉన్న ఫొటోలను ఆయన సోషల్ మీడియా ప్లాట్​ఫాం ట్రూత్​(Truth) లో పోస్టు చేశారు. అలాగే వైట్​ హౌస్(White House)​ ‘ఎక్స్​’ ఖాతా కూడా ఈ ఫోటోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్​ అవుతోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ట్రంప్​ తనకు తాను పోప్‌గా ఊహించుకుంటున్నారని సోషల్​ మీడియా(Social Media)లో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

    Donald Trump | ఇటీవలే మరణించిన పోప్​ ఫ్రాన్సిస్​

    పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి పోప్‌ ఎన్నిక త్వరలో జరగనుంది. ఈ ఎన్నిక అత్యంత రహస్యంగా జరగనుంది. కాగా.. ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ట్రంప్ దంపతులు (Trump couple) హాజరయ్యారు.

    ఈ సందర్భంగా పలువురు విలేకరులు కొత్త పోప్‌గా ఎవరు ఉండాలని అనుకుంటున్నారని ట్రంప్​ను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ ‘‘పోప్‌ నేనే అవ్వాలనుకుంటున్నాను’’ అని చెప్పారు. అన్నట్లుగానే.. ట్రంప్ పోప్ అవతారం ఎత్తారని సోషల్​ మీడియాలో నెటిజన్లు (Netizens) కామెంట్లు చేస్తున్నారు. ట్రంప్​ ఏం చేసినా సంచలనంగానే ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...