అక్షరటుడే, వెబ్‌డెస్క్: Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‌కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను నిలిపేశారు. అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం (Brown University)లో ఇటీవల కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. తొమ్మిది మంది గాయపడ్డారు.
ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడు పోర్చుగీస్ చెందిన వాడిగా అధికారులు గుర్తించారు. నిందితుడు గ్రీన్‌కార్డ్ లాటరీ ద్వారానే అమెరికాకు వచ్చాడు. దీంతో ఈ విధానాన్ని నిలిపివేయాలని ట్రంప్ నిర్ణయించారు. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు. ట్రంప్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఆపేయాలని యునైటెడ్ స్టేట్స్ (United States) సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ను ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
Donald Trump | అనేక దరఖాస్తులు
వైవిధ్య వీసా కార్యక్రమం (Visa Program) ప్రతి సంవత్సరం యునైటెడ్ స్టేట్స్లో తక్కువ ప్రాతినిధ్యం వహించే దేశాల నుంచి వలసలను ఆహ్వానిస్తోంది. చాలా వరకు ఆఫ్రికాలో ఉన్న ప్రజలకు లాటరీ ద్వారా 50 వేల గ్రీన్ కార్డులను అందిస్తుంది. 2025 వీసా లాటరీకి దాదాపు 20 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. విజేతలతో జీవిత భాగస్వాములను చేర్చినప్పుడు 131,000 మందికి పైగా ఎంపికయ్యారు. గెలిచిన తర్వాత, వారు యునైటెడ్‌లో ప్రవేశం పొందాలంటే వెకేషన్ చేయించుకోవాలి. పోర్చుగీస్ పౌరులు కేవలం 38 స్లాట్లను మాత్రమే గెలుచుకున్నారు. విజేతలను కాన్సులేట్లలో ఇంటర్వ్యూ చేస్తారు. అయితే ట్రంప్ చాలా కాలంగా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా కాల్పుల ఉదంతంతో ట్రంప్ గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్ (Green Card Lottery Program)ను నిలిపివేశారు. నవంబర్‌లో నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన దాడిలో అఫ్గన్ పౌరుడు నిందితుడిగా గుర్తించారు. ఈ ఘటన అనంతరం ఆయన పలు దేశాల నుంచి వలసలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.