Homeఅంతర్జాతీయంUS Tariffs | ట్రంప్​ గుడ్​న్యూస్​.. భారత్​పై సుంకాలు తగ్గిస్తామని ప్రకటన

US Tariffs | ట్రంప్​ గుడ్​న్యూస్​.. భారత్​పై సుంకాలు తగ్గిస్తామని ప్రకటన

భారత్​పై సుంకాలు తగ్గిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ తెలిపారు. త్వరలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : US Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) గుడ్​ న్యూస్​ చెప్పారు. భారత్​పై సుంకాలు తగ్గిస్తామని ప్రకటించారు. దీనిపై త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో అమెరికా (America) భారత్​పై సుంకాలు విధించిన విషయం తెలిసిందే. మొదట 25 శాతం టారిఫ్స్​ వేసిన ట్రంప్​ తర్వాత.. దానిని 50 శాతానికి పెంచారు. అలాగే ఫార్మా ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు విధిస్తున్నారు. దీంతో అమెరికా మార్కెట్లలో ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఫలితంగా కొనుగోళ్లు తగ్గి భారత కంపెనీలు నష్టపోతున్నాయి. ఈ తరుణంలో ట్రంప్​ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

US Tariffs | అత్యధికంగా..

ప్రస్తుతం అమెరికా భారత్​పైనే అత్యధిక సుంకాలు విధిస్తోంది. దీనిపై మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. భారతదేశంపై సుంకాలను తగ్గిస్తామని, వాషింగ్టన్, న్యూఢిల్లీ వాణిజ్య ఒప్పందం (New Delhi Trade Agreement)పై సంతకం చేయడానికి దగ్గరగా ఉన్నాయని తెలిపారు. రష్యా చమురు కారణంగా భారతదేశంపై సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ట్రంప్​ అన్నారు. అయితే భారత్​ ఆయిల్​ దిగుమతులను తగ్గిస్తోందని ట్రంప్​ పేర్కొన్నారు. దీంతో తాము కూడా ఏదో ఒక సమయంలో సుంకాలను తగ్గిస్తాము అని తెలిపారు.

US Tariffs | త్వరలో భారత్​కు..

భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ (US Ambassador Sergio Gore) ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా ముఖ్యమైనవిగా ట్రంప్​ పేర్కొన్నారు. కాగా ఇటీవల ట్రంప్​ తాను త్వరలో భారత్​ (India)లో పర్యటిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. మోదీ తనకు మంచి మిత్రుడని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో త్వరలోనే భారత్​పై సుంకాలు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా వియత్నాంపై 20 శాతం, మలేషియా, కంబోడియా వంటి ఆసియాన్ దేశాలపై 19 శాతం సుంకాలను విధిస్తోంది. అయితే భారత్​పై సుంకాలను 15 నుంచి 20 శాతానికి ట్రంప్​ పరిమితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Must Read
Related News