ePaper
More
    Homeఅంతర్జాతీయంAmerica | బహిరంగ సభలో ట్రంప్​ సన్నిహితుడి హత్య

    America | బహిరంగ సభలో ట్రంప్​ సన్నిహితుడి హత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ సన్నిహితుడు చార్లి కిర్క్ (Charlie Kirk)​ దారుణ హత్యకు గురయ్యారు.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రుడు, రైట్​ వింగ్​ యాక్టివిస్ట్​ చార్లీ కిర్క్ (31) ఉటాలోని ఒక విశ్వవిద్యాలయ కార్యక్రమంలో మాట్లాడుతుందగా.. దుండగుడు కాల్చి చంపాడు. వ్యాలీ విశ్వవిద్యాలయం (Valley University)లో జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతున్న కిర్క్ లక్ష్యంగా కాల్పులు జరపడంతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

    America | ఒక్కసారిగా ఆందోళన

    “ది అమెరికన్ కమ్‌బ్యాక్”, “ప్రూవ్ మీ రాంగ్” అనే నినాదాలతో విద్యార్థులతో కిర్క్ మాట్లాడుతుండగా.. కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. దుండగుడు కిర్క్​ మెడ భాగంలో కాల్చాడు. దీంతో పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించినా.. ఆయన మృతి చెందాడు. కిర్క్ 18 ఏళ్ల వయసులోనే టర్నింగ్​ పాయింట్​ యూఎస్​ఏ ఆర్గనైజేషన్​ను స్థాపించారు.

    America | ట్రంప్​ దిగ్భ్రాంతి

    చార్లి కిర్క్ మృతిపై డోనాల్డ్​ ట్రంప్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా సంతాపం తెలిపారు. ది గ్రేట్, లెజెండరీ చార్లీ కిర్క్ మరణించాడు అని ట్రంప్ తన ట్రూత్ వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో యువత హృదయాన్ని చార్లీ కంటే బాగా ఎవరూ అర్థం చేసుకోలేరని ఆయన అన్నారు. ‘‘అందరూ, ముఖ్యంగా నేను అతన్ని ప్రేమించాను, ఆరాధించాను, ఇప్పుడు అతను మాతో లేడు” అని ట్రంప్​ తెలిపారు.

    America | కిర్క్​ గౌరవార్థం

    కిర్క్ గౌరవార్థం ఆదివారం వరకు అమెరికా అంతటా జెండాలను సగం అవనతం చేయాలని ట్రంప్ ఆదేశించారు. ఉటా గవర్నర్ స్పెన్సర్ కాక్స్ కాల్పులను రాజకీయ హత్యగా అభివర్ణించారు. ఇది రాష్ట్రానికి చీకటి రోజు. దేశానికి విషాదకరమైన రోజు అని అన్నారు. నిందితుడిని అమెరికన్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

    More like this

    Nepal | నేపాల్‌లో క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల స‌డ‌లింపు.. ర‌ద్దీగా మారిన మార్కెట్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నిర‌స‌న‌ల‌తో అట్టుడికిన నేపాల్‌లో ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయి. రెండ్రోజుల పాటు విధ్వంసంతో...

    Sushila Karki | తాత్కాలిక ప్ర‌భుత్వ ఏర్పాటుకు రెడీ.. నాయ‌క‌త్వం వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌న్న సుశీల క‌ర్కి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sushila Karki | నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని జెన్‌-జి చేసిన‌ ప్రతిపాదన‌కు...

    SadabaiNama regularization | రైతులకు గుడ్​న్యూస్​.. సాదాబైనామా క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్​.. 9.89 లక్షల మందికి ప్రయోజనం

    అక్షరటుడే, హైదరాబాద్: SadabaiNama regularization : అప్రకటిత భూమి లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి సాదాబైనామా అవకాశం కల్పించింది. తద్వారా సాగు...