Homeఅంతర్జాతీయంPM Modi | ప్రధానికి ట్రంప్​ ఫోన్​.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడదామన్న మోదీ

PM Modi | ప్రధానికి ట్రంప్​ ఫోన్​.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడదామన్న మోదీ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ప్రధాని మోదీకి ఫోన్​ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్​ కాల్​పై మోదీ ఎక్స్​ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ప్రధాని మోదీకి ఫోన్​ చేశారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్​వేదికగా ట్రంప్​కు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
అమెరికా ఇటీవల భారత్​పై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత వస్తువులపై ట్రంప్​ 50 శాతం సుంకాలు అమలు చేస్తున్నారు. ఫార్మా ప్రోడక్ట్స్​పై వంద శాతం టారిఫ్​లు వేశారు. ఈ క్రమంలో తాజాగా దీపావళి (Diwali) సందర్భంగా ఆయన మోదీకి ఫోన్​ చేయడం గమనార్హం. అనంతరం మోదీ ఎక్స్​ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘ఈ పండుగ నాడు మన రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచంలో ఆశల వెలుగులు నింపాలి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి” అని ప్రధాని పోస్ట్ చేశారు.

PM Modi | వైట్​హౌస్​లో దీపావళి

వైట్ హౌస్‌లో (White House) జరిగిన కార్యక్రమంలో ట్రంప్ దీపం వెలిగించి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీతో (PM Modi) తాను మాట్లాడినట్లు ఆయన విలేకరులతో చెప్పారు. రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ట్రంప్​ పేర్కొన్నారు. కాగా.. ట్రంప్​ చాలా రోజులుగా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా భారత్​ మాత్రం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. మరోవైపు భారత్-పాకిస్థాన్ (India-Pakistan) వివాదాన్ని ఆపానని ట్రంప్​ అన్నారు.

PM Modi | గొప్ప స్నేహితుడు

ప్రధాని మోదీ తనకు గొప్ప స్నేహితుడు అంటూ ట్రంప్ (Donald Trump) ప్రశంసించారు. ఆయనకు మంగళవారం తాను ఫోన్ చేశానని చెప్పారు. భారత్​, అమెరికా కొన్ని గొప్ప ఒప్పందాలపై పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కాగా.. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు సఫలం అయితే భారత్​పై విధించిన సుంకాలను ట్రంప్​ తగ్గించే అవకాశం ఉంది. కాగా.. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం ముగియాలని మోదీ కోరుకుంటున్నట్లు ట్రంప్ మీడియాతో​ తెలిపారు.