HomeUncategorizedTrump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన...

Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో వాణిజ్య చర్చలపై కీలక ప్రకటన చేశారు.

భారత్‌ను బెదిరింపులతో భయపెట్టాలని చూసిన ట్రంప్.. ఇక తన ఆటలు సాగవని తెలిసి వెనక్కి తగ్గారు. తాను చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే చర్యలకు ఉపక్రమించారు.

Trump backs down : చర్చలకు సిద్ధం..

భారత్‌తో వాణిజ్య చర్చలు మళ్లీ మొదలవుతున్నాయని ట్రంప్​ తాజాగా ప్రకటించారు. భారత్​ – అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య అడ్డంకులను తొలగిస్తామని, ఆ దిశగా ఈ చర్చలు జరుపుతామని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని యూఎస్​ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ US President Donald Trump స్వయంగా తన సోషల్ మీడియా సోషల్ ట్రూత్ social media platform Social Truth వేదికగా ప్రకటించాడు. ఇక ట్రంప్​ తాజా ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.

భారత్​ – అమెరికా మధ్య వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు చర్చలు కొనసాగిస్తున్నామని ప్రకటించడం సంతోషంగా ఉందని ట్రంప్​ చెప్పుకొచ్చారు.

స్నేహితుడు, భారత్​ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రాబోయే రోజుల్లో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని ట్రంప్​ పేర్కొన్నారు.

భారత్​ – యూఎస్​కు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయని.. సోషల్​ మీడియా వేదికగా డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Trump backs down :  స్పందించిన మోడీ..

ట్రంప్​ ప్రకటనపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. భారత్​ – అమెరికా సన్నిహిత స్నేహితులుగా మోడీ పేర్కొన్నారు. సహజ భాగస్వాములుగా వర్ణించారు.

త్వరలో జరగబోయే వాణిజ్య చర్చలు భారత్​ – అమెరికా భాగస్వామ్యం యొక్క అపరిమిత సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి మార్గం సుగమం చేస్తాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చర్చలను వీలైనంత త్వరగా ముగించడానికి తమ బృందాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. యూఎస్​ అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడటానికి కూడా తాను ఎదురు చూస్తున్నానని సోషల్​ మీడియా వేదికగా మోడీ వెల్లడించారు.

రెండు దేశాల ప్రజలకు ప్రకాశవంతమైన, మరింత సంపన్నమైన భవిష్యత్తును భద్రపరచడానికి తాకలిసి పని చేస్తామని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ Indian Prime Minister Narendra Modi ప్రకటించారు.

Must Read
Related News