Trump Comments | ఎంతకాలం ఉంటానో తెలియదు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

డోనాల్డ్​ ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతకాలం బతికి ఉంటానో తెలియదని అన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్:Trump Comments |  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతకాలం బతికి ఉంటానో తెలియదని ఆయన అన్నారు. తనపై జరుగుతున్న హత్యాయత్నాలపై స్పందిస్తూ ఆయన ఈ విధంగా స్పందించారు.

ఫ్లోరిడా (Florida)లోని ట్రంప్​ నివాసంలోకి శనివారం ఓ దుండగుడు ప్రవేశించిన విషయం తెలిసిందే. తుపాకీ పట్టుకొని వచ్చిన అతడిని గుర్తించిన భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటనపై స్పందిస్తూ.. “నేను ఎంతకాలం ఉంటానో తెలియదు” అని ట్రంప్ అన్నారు. “నా కోసం చాలా మంది కాల్పులు జరుపుతున్నారు, కాదా?” అని పేర్కొన్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో రెండు సార్లు ట్రంప్​పై హత్యాయత్నం జరిగింది. ఓ సారి ఆయన చెవిని తాకుతూ బుల్లెట్​ దూసుకెళ్లింది.

Trump Comments | వారినే లక్ష్యంగా..

దుండగులు విజయాలు సాధించే అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుంటారని ట్రంప్​ అన్నారు. గతంలో హత్యకు గురైన ఇద్దరు అధ్యక్షులు అబ్రహం లింకన్ (Abraham Lincoln), జాన్ ఎఫ్. కెన్నెడీ (John F. Kennedy)లను ఆయన ఉదాహరణలుగా ప్రస్తావించారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తాను వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. కాగా ట్రంప్​ నివాసంలోకి చొరబడిన వ్యక్తిని నార్త్ కరోలినాకు చెందిన 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్ మార్టిన్‌గా అధికారులు గుర్తించారు. మార్టిన్ పామ్ బీచ్ ఎస్టేట్ ఉత్తర ద్వారం నుంచి తెల్లవారుజామున 1:30 గంటలకు (స్థానిక సమయం) కారులో ప్రయాణించాడని యూఎస్ సీక్రెట్ సర్వీస్ (US Secret Service) ఏజెంట్లు తెలిపారు. అతడి వద్ద ఒక షాట్‌గన్ మరియు పెట్రోల్ డబ్బా ఉందని అధికారులు తెలిపారు.

Related articles

Influencer Labor Controversy | భార్య ప్రసవ వేదనను వీడియోగా.. మధ్యలో యాడ్ ప్రమోషన్ .. పిచ్చి పీక్స్‌కి చేరిందేంటి..!

సియాటెల్‌లో నివసిస్తున్న చైనాకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ ‘పాల్ ఇన్ యూఎస్ఏ’ తన భార్య 23 గంటల ప్రసవ వేదనను వీడియోగా పోస్ట్ చేసి, అదే వీడియోలో పెయిడ్ యాడ్ చదివిన ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ప్రజాగ్రహం మధ్య డౌయిన్, వీబో అతడి ఖాతాలను నిషేధించాయి.

Hyderabad Family Suicide | హైదరాబాద్​లో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

హైదరాబాద్​లోని అంబర్​పేటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

Rythu Bharosa Delay | రైతు భరోసా లేనట్లేనా.. ఆందోళనలో అన్నదాతలు

యాసంగి సీజన్​కు సంబంధించి రైతు భరోసాను ప్రభుత్వం ఇంకా జమ చేయలేదు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

Stock Market Crash | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్‌పై బేర్ పట్టు బిగించడంతో ప్రధాన సూచీలన్నీ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 715 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 197 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.