అక్షరటుడే, వెబ్డెస్క్ : Trump Tariff | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ చైనాపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. చైనా దిగుమతులపై అదనంగా 100% టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్‌లు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు చైనాపై 30% టారిఫ్‌లు ఉన్న విషయం తెలిసిందే. రాబోయే రెండు వారాల్లో దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(China President Xi Jinping) మధ్య జరగనున్న సమావేశం ముందు ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ట్రంప్ ఈ సమావేశం నేపథ్యంలో సైతం తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చైనా అరుదైన ఖనిజాలపై ఆంక్షలు విధించడంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ, ఈ భేటీ రద్దు చేసుకునే అవకాశమూ ఉందని హెచ్చరించారు.
Trump Tariff | చైనా ఆంక్షలపై ట్రంప్ ఆగ్రహం
చైనా(China) ప్రకటించిన అరుదైన ఖనిజాలపై ఆంక్షలు అమెరికాకు తీవ్రమైన ఎదురుదెబ్బనని ట్రంప్ గుర్తించారు. ఇది అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై ప్రభావం చూపుతుండటం, అమెరికా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీయడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్(Donald Trump) తన ట్విట్టర్‌లో కూడా ఈ నిర్ణయాన్ని వివరించారు. చైనా ఈ నిర్ణయంతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని, ఇప్పటికే అనేక దేశాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని పేర్కొన్నారు. “చైనా ఉత్పత్తులపై 100% సుంకాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం,” అని చెప్పారు. ఈ కొత్త టారిఫ్‌లు నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు.
ఈ చర్యలకు చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తే, సుంకాల మోత ఈనెలలోనే ప్రారంభమవుతుందని ట్రంప్ అన్నారు. చైనాపై 100శాతం టారిఫ్‌లు అనంతరం ట్రంప్ తన సోషల్ ట్రూత్ లో కామెంట్ చేస్తూ..‘‘చైనాలో విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి. అరుదైన ఖనిజాలపై పలు ఆంక్షలు విధించాలనుకుంటున్నాయి. దీనిపై ప్రపంచంలోని అన్ని దేశాలకు లేఖలు పంపుతున్నాయి. ఈ నిర్ణయం మినహాయింపులు లేకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుంది. ఇది వారు సంవత్సరాల క్రితం రూపొందించిన ప్రణాళిక అని ట్రంప్ పేర్కొన్నారు. చైనా విధించే చర్యల వల్ల వారు చాలా దేశాలకు శత్రువులుగా మారుతున్నారు. మనం చైనాతో కొంత కాలంగా మంచి సంబంధాలు నిర్వహిస్తున్నప్పటికీ, వారి చర్యలు మాకు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో దక్షిణ కొరియాలో జరగబోయే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశానికి కారణం కనిపించడం లేదని ఆయన తెలిపారు. అందుకే, చైనా ఉత్పత్తులపై భారీగా, 100 శాతం సుంకాలు విధించడానికి నిర్ణయించుకున్నాం. ఈ సుంకాలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే, అన్ని ముఖ్యమైన సాఫ్ట్‌వేర్‌లపై ఎగుమతి నియంత్రణలు కూడా విధిస్తామని ట్రంప్ చెప్పారు.