అక్షరటుడే, వెబ్డెస్క్: US President | అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald trump) అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏదో ఒక నిర్ణయంతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ తన 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలనాత్మక హామీ ఇచ్చారు. ఆయన ప్రతిపాదించిన “బేబీ బోనస్ స్కీమ్”(Baby Bonus Scheme) ప్రకారం, అమెరికాలో పుట్టిన ప్రతి శిశువు పేరిట జనన సమయంలోనే $1000 డాలర్లు(సుమారు రూ. 83,000) ప్రభుత్వ ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకాన్ని అధికారికంగా “ఆల్-అమెరికన్ బేబీ బోనస్” అని పిలుస్తున్నారు. ఈ స్కీమ్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
US President | ట్రంప్ కొత్త పథకం..
అమెరికాలో పుట్టిన ప్రతీ పౌర శిశువు(US Citizen by birth)కు ఈ సౌకర్యం వర్తిస్తుంది. పుట్టిన వెంటనే $1000 డాలర్లు ఆయా పిల్లల పేరున సురక్షిత గవర్నమెంట్ ఖాతాలో జమ అవుతాయి. ఈ మొత్తాన్ని 18 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. విద్య, వైద్యం, గృహావసరం వంటి అవసరాల కోసమే ఈ మొత్తాన్ని వాడేలా నిబంధనలు పెట్టే యోచన చేస్తున్నారు. ఈ పథకం అమెరికా(America)లో అక్రమంగా నివసిస్తున్న వారు, విదేశీయులకు పుట్టిన పిల్లలకు వర్తించదు. మరొక వైపు ఈ పథకం ద్వారా అమెరికన్ పౌరత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశముందని ట్రంప్ తెలిపాడు. ఇది పిల్లల భవిష్యత్తు పెట్టుబడిగా ట్రంప్ చెప్పుకొచ్చారు. వారు పెద్దవయసుకు వచ్చేసరికి తాము స్వతంత్రంగా జీవితాన్ని నిర్మించుకునే స్థాయిలో ఈ మొత్తం ఉపయోగపడుతుంది. ఇది అమెరికన్ కలను నిజం చేయడానికి మరో దశ” అని ట్రంప్ చెప్పారు.
2024 జనవరి 31 తర్వాత నుండి 2029 డిసెంబర్ 31 మధ్య జన్మించే అమెరికన్ పౌరులకు ఫెడరల్ ప్రభుత్వం(Federal Government) ఏక మొత్తంగా వెయ్యి డాలర్లను(Dollars) ట్యాక్స్ డెఫర్ట్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ట్రంప్ అన్నారు. ఈ ఖాతాలను పిల్లల సంరక్షకులు నియంత్రిస్తారు. వారు ఈ ఖాతాలో ప్రైవేట్ కాంట్రి బ్యూషన్ కింద ఏటా 5వేల డాలర్ల వరకు జమచేసే అవకాశం ఉంది. ఇది భావితరాల దీర్ఘకాలిక ఆర్ధిక అభివృద్ధిని బలోపేతం చేస్తుందని ట్రంప్ అన్నారు.