Homeజిల్లాలునిజామాబాద్​TRSMA | ట్రస్మా నూతన కార్యవర్గం ఎన్నిక

TRSMA | ట్రస్మా నూతన కార్యవర్గం ఎన్నిక

ట్రస్మా నూతన కార్యవర్గాన్ని బుధవారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సుందర్​, కార్యదర్శిగా అనుముల క్రాంతి ఎన్నికయ్యారు. త్వరలోనే పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు వారు ఈ సందర్భంగా ప్రకటించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: TRSMA | తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు ప్రైవేటు పాఠశాలల (Private Schools) యాజమాన్య సంఘం (ట్రస్మా) నిజామాబాద్​ (Nizamabad) నూతన కార్యవర్గం ఎన్నికైంది. నూతన అధ్యక్షుడిగా సుందర్ (శ్రీ భాషిత పాఠశాల ఆర్మూర్), జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనుముల క్రాంతి (ఆర్కిడ్ పాఠశాల నిజామాబాద్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎన్నికల అధికారిగా అసోసియేషన్​ రాష్ట్ర కోశాధికారి రాఘవేందర్ రెడ్డి, పరిశీలకులుగా శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ.. తొందర్లోనే మిగతా కార్యవర్గం ఎన్నుకుంటామన్నారు. ప్రైవేటు పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.