అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | మనిషి పుట్టినా.. మృతిచెందిన ధ్రువీకరణ పత్రం (birth or death certificate) తప్పనిసరి. నిత్యం పదుల సంఖ్యలో జనన మరణ ధ్రువీకరణ పత్రాల కోసం నగరవాసులు కార్పొరేషన్ కార్యాలయంలో (municipal corporation office) దరఖాస్తు చేసుకుంటారు.
Nizamabad City | సర్వర్తో సమస్యలెన్నో..
గత పది రోజులుగా ధ్రువీకరణ పత్రాల కోసం నగరవాసులకు తిప్పలు తప్పడం లేదు. సర్వర్ రావడం లేదని అధికారులు చెప్పడంతో చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెలలో సైతం సుమారు 15 రోజులు సర్వర్ పని చేయలేదు. దీంతో వీటికోసం వచ్చేవారు పడి కాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. సర్వర్ సమస్యను పరిష్కరించి జనన ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని కోరుతున్నారు.