ePaper
More
    HomeసినిమాTrivikram Srinivas | అల్లు అర్జున్ టూ ఎన్టీఆర్.. త్రివిక్ర‌మ్‌కి మంచే జ‌రిగింది..!

    Trivikram Srinivas | అల్లు అర్జున్ టూ ఎన్టీఆర్.. త్రివిక్ర‌మ్‌కి మంచే జ‌రిగింది..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Trivikram Srinivas | మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌గా అల్లు అర్జున్‌(Allu Arjun)తో సినిమా చేయాల‌ని అనుకున్నాడు. ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో కథ రెడీ చేసుకొని బన్నీ డేట్స్ కోసం త్రివిక్రమ్ ఎదురు చూశారు.

    పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్-బన్నీ అనౌన్స్‌మెంట్ వస్తుందని అంతా భావించారు. కానీ, బన్నీ అట్లీ సినిమాకి క‌మిట‌య్యాడు. బన్నీ-త్రివిక్రమ్ మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. ఎంత బాండింగ్ ఉన్నా, ఇంత వెయిటింగ్‌లో పెట్టడం త్రివిక్రమ్‌కు సబబుగా అనిపించక‌పోవ‌డంతో ఆ కథను ఎన్టీఆర్ (Jr. NTR) వైపు తిప్పారు. దాంతో త్రివిక్ర‌మ్‌కి మంచే జ‌రిగింద‌ని అంటున్నారు. బ‌న్నీతో మైథాలజికల్ కథ అనగానే ఎలా ఉంటుందో అనే అనుమానాలు అంద‌రిలో క‌లిగాయి. ఇప్పుడు ఆ కథ ఎన్టీఆర్‌కి రావడంతో త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

    Trivikram Srinivas | అనౌన్స్‌మెంట్ త‌రువాయి..

    పౌరాణికాలు ఎన్టీఆర్‌కి NTR బాగా సెట్ అవుతాయి. యమదొంగలో కాసేపు యంగ్ యమా‌గా కనిపించినప్పుడు థియేటర్ దద్దరిల్లింది. ఆయన పూర్తి స్థాయి పౌరాణికం చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పుడు ఇలా సెట్ అయింద‌ని అంటున్నారు. ‘గుంటూరు కారం’ మూవీ తర్వాత త్రివిక్రమ్ ఏడాదిన్నరగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పైనే దృష్టి సారించారు. బన్నీతో మూవీ అనౌన్స్‌మెంట్ వస్తుందని భావించగా దానికి బ్రేక్ పడడంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌(Global star Ram Charan)తో మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ ప్రాజెక్టుకు ముందే విక్టరీ వెంకటేష్‌తో ఓ మూవీ చేస్తారనే టాక్ వినిపించింది. ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీ చేస్తున్నారు.

    ఇక ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా నా ఫేవరెట్… మోస్ట్ పవర్‌ఫుల్ గాడ్‌గా కనిపించనున్నాడు అంటూ నిర్మాత నాగ వంశీ producer Naga Vamsi ట్వీట్ పెట్టారు. నాగవంశీకి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టం ఉందో ఆయన గతంలో పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇప్పుడు ఈ శ్లోకాలు, పౌరాణిక సినిమా బజ్ మధ్య ఈ ట్వీట్ రావడంతో.. త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో ప్లాన్ అయిన మైథలాజికల్ మూవీ (Mythological movie), ఇప్పుడు ఎన్టీఆర్ చేతికి వెళ్లిందని అంతా ఫిక్సయ్యారు. మ‌రి దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this