HomeసినిమాActress Trisha | నా పెళ్లే కాదు, హ‌నీమూన్ కూడా ప్లాన్ చేయండి అంటూ త్రిష...

Actress Trisha | నా పెళ్లే కాదు, హ‌నీమూన్ కూడా ప్లాన్ చేయండి అంటూ త్రిష కౌంట‌ర్

Actress Trisha | ప్రముఖ నటి త్రిష తన పెళ్లిపై వస్తున్న వదంతులపై తనదైన స్టైల్‌లో ఘాటుగా స్పందించారు. చండీగఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో తాను పెళ్లి చేసుకోనున్నట్లు ఇటీవల మీడియాలో వచ్చిన కొన్ని కథనాలపై ఆమె వ్యంగ్యంగా స్పందించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Actress Trisha | స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వయసు 40 దాటినా కుర్ర హీరోయిన్స్‌కి పోటీ ఇస్తున్న‌ ఈ చెన్నై బ్యూటీ, తాజాగా పెళ్లి వార్తలతో టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

గత కొన్ని రోజులుగా త్రిష ఓ ప్రముఖ చెన్నై బిజినెస్‌మేన్‌(Chennai Businessman)తో రిలేష‌న్‌లో ఉందని, ఇద్దరి మధ్య పెళ్లి డిస్కషన్స్ కూడా తుదిదశలో ఉన్నాయని కొన్ని పాపులర్ వెబ్‌సైట్లు రిపోర్ట్ చేశాయి. అతడు రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవాడని, గత ఏడాది నుంచి త్రిషతో క్లోజ్‌గా ఉన్నాడ‌ని వార్తలు వైరల్ అయ్యాయి. మ‌రి కొద్ది రోజులలో వీరి వివాహం జ‌ర‌గ‌డం ఖాయం అంటూ జోస్యాలు చెప్పారు.

Actress Trisha | కొట్టి పారేసింది..

తాజా రూమర్లపై త్రిష(Trisha) సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించింది. నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్నవారిని నేను ప్రేమిస్తున్నా. హనిమూన్ షెడ్యూల్ కూడా వాళ్లే ప్రకటిస్తారేమో! వెయిట్ చెయ్యండి!” అంటూ సెటైరికల్ పోస్టు పెట్టింది. ఈ పోస్ట్‌తో త్రిష మరోసారి తన పెళ్లిపై వస్తున్న వార్తలను ఖండించినట్లయ్యింది. గతంలోనూ త్రిష నిశ్చితార్థం(Engagement) వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.త్రిష చెన్నై బిజినెస్‌మేన్ వరుణ్ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకోగా, కొన్ని నెలల్లోనే అది రద్దయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత త్రిష పూర్తిగా తన కెరీర్‌పైనే ఫోకస్ పెట్టింది. అప్పటి నుంచి పలువురితో డేటింగ్ చేస్తుందంటూ పుకార్లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే ఆమె ఎప్పుడూ తన ప్రైవేట్ లైఫ్‌పై మౌనమే వహించింది.

42 ఏళ్లు దాటినా త్రిష  గ్లామర్‌, గ్రేస్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తుండగా, తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కుతోన్న ‘కరుప్పు’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రెండు సినిమాల‌పై త్రిష బోలెడ‌న్ని హోప్స్ పెట్టుకుంది. ఇందులో ఒక్క చిత్రం హిట్ అయిన త్రిష జోరు పీక్స్‌లో ఉంటుంది. పర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే 42 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న త్రిష ఇప్ప‌టికీ పెళ్లిపై ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం అభిమానుల‌కి బాధ‌ని క‌లిగిస్తుంది.

Related News