అక్షరటుడే, ఆర్మూర్: Police Martyrs Week | విధి నిర్వహణలో ప్రాణాలొదిలిన పోలీసు అమరవీరులకు పోలీస్‌శాఖ (police department) ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు పోలీసు అధికారులు అమరులైన పోలీసు సిబ్బంది ఇంటికి వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శించారు.
Police Martyrs Week | ఆలూర్ మండలంలో..
మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో అమరుడైన ఆలూర్ మండల కేంద్రానికి (Aloor mandal center) చెందిన కానిస్టేబుల్ గణేష్‌కు పోలీసు అధికారులు నివాళులర్పించారు. ఈ మేరకు బుధవారం ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి (ACP Venkateshwar Reddy), సీఐ సత్యనారాయణలు కలిసి గణేశ్ ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన మృతికి సంతాపంగా రెండునిమిషాలు మౌనం పాటించారు.
Police Martyrs Week | మెండోరాలో..
మెండోరా మండలంలోని (Mendora mandal) చాకిర్యాల్ గ్రామానికి చెందిన పోలీస్ అమరవీరుడు వోడినాల నర్సయ్యకు పోలీస్ అధికారులు నివాళులర్పించారు. కానిస్టేబుల్ నర్సయ్య 1989లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై డిచ్పల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా.. 1991లో బాంబుపేలుడులో మృతిచెందారు. ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ శ్రీధర్ రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని కలిసి నర్సయ్య ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
