Homeజిల్లాలుకామారెడ్డిKomuram Bheem | ఉమ్మడిజిల్లాలో ఘనంగా కొమురంభీం జయంతి

Komuram Bheem | ఉమ్మడిజిల్లాలో ఘనంగా కొమురంభీం జయంతి

ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీరుడు కొమురంభీం జయంతిని బుధవారం ఉమ్మడిజిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Komuram Bheem | ఆదివాసుల ఆరాధ్య దైవం, హక్కుల సాధన కోసం పోరాడిన వీరుడు కొమురం భీం జయంతిని ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆదివాసుల కోసం ఆయన చేసిన పోరాటం యువతకు స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు.

Komuram Bheem | ఆదివాసి నాయక్​పోడ్​ సేవా సంఘం ఆధ్వర్యంలో..

నగరంలోని వినాయక్​నగర్​ హనుమాన్​ జంక్షన్ (Hanuman Junction)​ వద్ద కొమురం భీం విగ్రహానికి ఆదివాసి నాయక్​పోడ్​ సేవాసంఘం ఆధ్వర్యంలో కొమురంభీం విగ్రహానికి నివాళులర్పించారు. ఆదివాసి నాయక్​పోడ్​ సేవాసంఘం నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్​, జిల్లా పరిషత్ మాజీ​ ఛైర్మన్​ దాదన్నగారి విఠల్​రావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు జగన్​ మోహన్​ రెడ్డి తదితరులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గాండ్ల రాంచందర్​ మాట్లాడుతూ.. హైదరాబాద్​లోని (Hyderabad) ట్రైబల్​ కమిషన్​(Tribal Commission) అధికారి ఉద్దేశపూర్వకంగా నాయక్​పోడ్​ విద్యార్థులను చదవనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎడపల్లి మండలానికి చెందిన విద్యార్థినికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ చదవనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా నాయకులు నాయక్​పోడ్​ సంఘం ప్రతినిధులు శ్రీనివాస్​రావు, మధుకర్​, గోపాల్​రెడ్డి, బండారి భోజన్న శానం పవన్, డిప్యూటీ సీఈవో సాయన్న, అధికార ప్రతినిధి పుట్ట దుర్గ మల్లేష్, తౌడగారి చిన్న విఠల్ హన్మాండ్లు, శానం నాగభూషణం, గడ్డం రవీందర్, అన్నం సాయిలు, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Komuram Bheem | ముప్కాల్‌లో..

అక్షరటుడే, ముప్కాల్: ఆదివాసీ నాయక్​పోడ్​ సంఘం (Adivasi Nayakpod Sangham) ఆధ్వర్యంలో బుధవారం కొమరం భీం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ మహా నాయకుడు కొమురంభీంను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయక్​పోడ్​ సంఘం సభ్యులు ఐక్యత, హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని సంకల్పించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు కంచు శ్రావణ్, విజయ్, సతీష్, నర్సయ్య, గంగాధర్, జువ్వన తదితరులు పాల్గొన్నారు.

Komuram Bheem | బాన్సువాడలో..

అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని హన్మాజిపేట్ (Hanmajipet) గ్రామంలో గిరిజనుల ఆరాధ్యదైవం కొమురం భీం జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెంకటి గణేష్, గ్రామాధ్యక్షుడు కొంకి సాయిలు మాట్లాడుతూ.. ఆదివాసుల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన కొమురం భీం ఆలోచనలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కొమురం భీం చూపిన మార్గంలో నడిచి ఆదివాసులు అభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్, సంఘ సభ్యులు కొంకి పోచయ్య, సాయిరాం, రాజు, పోతిని శుభాష్, గడీల గంగాధర్, మ్యాకల కాశీరం, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.