అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: TNGOs Nizamabad | తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ (jayashankar) జయంతి సందర్భంగా ఆయనకు టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.
నగరంలోని కంఠేశ్వర్(Kanteshwar) సర్కిల్లో ఉన్న జయశంకర్ విగ్రహానికి బుధవారం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్ నాశెట్టి సుమన్‌కుమార్(Nashetty Suman Kumar) పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, భీంగల్ యూనిట్ అధ్యక్షుడు సృజన్ కుమార్, ఎస్‌అండ్‌ఎల్‌ఆర్ స్పెషల్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యప్రకాష్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.