అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనులు ఐక్యతతో ముందుకు సాగాలని.. సేవాలాల్ బాటలో నడవాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు అంగోత్ రాంబాబు నాయక్ (Angoth Rambabu Nayak) అన్నారు. కోటగిరి మండలకేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం పూలమాల వేశారు. అలాగే సేవాలాల్ మహారాజ్ (Sevalal Maharaj) చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం బస్టాండ్ సమీపంలో సేవాలాల్ సేన దశాబ్ది జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ సేన పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మండలకేంద్రంలో మొదటిసారిగా జెండా ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. గిరిజన నాయకులు (tribal leaders) ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. లంబాడి, గిరిజన హక్కుల (Lambadi and tribal rights) సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేసి సాధించుకున్నామన్నారు.
కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రఘురాం రాథోడ్, ప్రధాన కార్యదర్శి రేఖా నాయక్, జిల్లా అధ్యక్షుడు సీతారాం నాయక్, ఉపాధ్యక్షుడు రవి నాయక్, కార్యదర్శి రాజు నాయక్, మండల అధ్యక్షుడు తారాసింగ్ నాయక్, ఉపాధ్యక్షుడు రామ్ కిషన్ నాయక్, ఫకీరా నాయక్, మాజీ సర్పంచ్ తుకారాం, పుండలిక్ సురేష్ నాయక్, కారోబార్లు, తదితరులు పాల్గొన్నారు.