HomeతెలంగాణIndalwai Police Station | ఇందల్వాయి పోలీస్​ స్టేషన్​ వద్ద గిరిజనుల ఆందోళన

Indalwai Police Station | ఇందల్వాయి పోలీస్​ స్టేషన్​ వద్ద గిరిజనుల ఆందోళన

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai Police Station | ఇందల్వాయి పోలీస్​ స్టేషన్​ వద్ద గిరిజనుల ఆందోళన దిగారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజన నాయకులను (tribal leaders) శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని ఇందల్వాయి పోలీస్​ స్టేషన్​కు (Indalwai Police Station) తరలించారు.

దీంతో వారి అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని అన్ని తండాల గిరిజనులు పోలీస్ స్టేషన్​కు తరలివచ్చారు. స్టేషన్​ వద్ద ఆందోళన చేపట్టారు. తమ నాయకులను వదిలిపెట్టేంతవరకు స్టేషన్ వద్దే ఉంటామని భీష్మించుకుని కూర్చున్నారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి (ACP Raja Venkat Reddy) ఇందల్వాయి పోలీస్​ స్టేషన్​ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గిరిజనులతో మాట్లాడి వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.