అక్షరటుడే, వెబ్డెస్క్: Mulugu | అటవీశాఖ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. ఈ ఘటన ములుగు(Mulugu) జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం చల్పాకలోని అటవీ భూముల్లో కొందరు గిరిజనులు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఈ క్రమంలో గుడిసెలను తొలగించడానికి అటవీ శాఖ అధికారులు(Forest Department officers) సోమవారం పోలీసుల సాయంతో జేసీబీ, డోజర్లతో వెళ్లారు. దీంతో గిరిజనులు ఫారెస్ట్ అధికారులు(Forest officers), పోలీసులపై తిరగబడ్డారు. కర్రలతో జేసీబీ, ట్రాక్టర్(Tractor)పై దాడి చేశారు. అధికారులపై కారం చల్లి కర్రలతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.