అక్షరటుడే, బాన్సువాడ: JEE Advanced Results | నస్రుల్లాబాద్ మండలంలోని (Nasrullabad mandal) సంగెం తండా (Sangem Thanda) నుంచి జేఈఈ అడ్వాన్స్లో ముగ్గురు గిరిజన విద్యార్థులు మెరిశారు. తండాకు చెందిన జరుపుల సుధాకర్ 177వ ర్యాంక్ సాధించాడు. మాలోత్ రవితేజ 509, నెనావత్ శేఖర్ 736 ర్యాంకులు సాధించి సత్తా చాటారు. సుధాకర్, రవితేజ ఇద్దరు నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్ చదివారు. సుధాకర్ ఆల్ ఇండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం గర్వకారణమని తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు.
